Breaking News

కొండపల్లిలో ఘనంగా సాయిబాబా వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు

-ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి మున్సిపాలిటీలోని బి కాలనీ వద్ద గజరాజు చెరువు పక్కన శ్రీ సాయిబాబా వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో  మైలవరం శాసనసభ్యులు  వసంత కృష్ణప్రసాదు ఆదివారం పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్ అక్కల రామ్మోహనరావు గాంధీ, సాయిబాబా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ శ్రీ సాయిబాబా వారి ఆలయాన్ని కొద్దిరోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ చిన్న, చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పెద్దలు అల్తాఫ్ రాజా  చొరవ తీసుకుని మంచి హృదయంతో ముందుకు వచ్చి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సహకరించారన్నారు. సాయిబాబా వారి ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టిన ఆరు మాసాల్లో పూర్తి చేయడం అభినందనీయమన్నారు. మైలవరం నియోజకవర్గంలో మతసామరస్యం దిశగా అన్ని మతాల వారు, అందరూ అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉంటున్నారని అన్నారు. ఇక్కడ దేవాలయం నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థాన కమిటీ సభ్యులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *