-ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ పట్టణం కాకాని నగర్ నందు ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకరరెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆదివారం ఒక ప్రకటనలో వారి కార్యాలయంలో మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ పై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.’అదో నల్లరాయి.. దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ’ గతంలో వెంకటేశ్వరస్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారు.అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కోటిమంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారు.గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ నేడు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం.గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయంలో, వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయి. ఇవి గత అయిదేళ్ల గణాంకాలు చూస్తే స్పష్టమవుతుంది.కరుణాకర రెడ్డి ప్రెస్ మీట్ లో చనిపోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదు, ఎక్కడివో.. వాటిని అడ్డుపెట్టుకుని టీటీడీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీటీడీ గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను సక్రమంగా చూసుకుంటుంటే టీటీడీ పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోశాలలోని 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజూ పర్యవేక్షించడం జరుగుతుంటే ఆవులకు జియోట్యాగ్ తీసేశారంటూ విష ప్రచారం చేస్తున్నారు.జనన, మరణాల రిజిష్టరును గోసంరక్షణ శాలలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా నమోదు చేస్తున్న విషయం తెలిసికూడా దురుద్దేశపూర్వకంగా రిజిస్టరులో నమోదు చేయడం లేదంటూ వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో స్వామి వారి ప్రసాదాలను కూడా దారిమళ్లించి అపచారాలకు పాల్పడిన చరిత్ర కరుణాకరరెడ్డిది కాదా అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు.
Prajavartha Online Telugu News