Breaking News

దయామయుడు అయిన క్రీస్తు చూపిన శాంతి మార్గం సమస్త మానవాళికి ఆచరణీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్ గిరిపురం కస్తూర్బాయ్ పేట , ఫ్రెండ్ సర్కిల్ రామ్మూర్తి మరియు హేమరాజు ఆధ్వర్యంలో ధనవంతుడు బీద లాజరు నాటకము ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ  విచ్చేసి ప్రజలతో మాట్లాడుతూ భగవంతుడు ఎక్కడో వుండడు. ఆయన  కోసం వెదకకుండా ఎదుటి మనిషిలో పరమాత్మనుచూసే దృష్టిని పెంచుకొంటే, ప్రతి అంగుళంలో భగవంతుడు కనిపిస్తాడు అన్నారు. బైబిల్‌లోని లూకా సువార్తలో చెప్పబడిన ఒక ఉపమాన కథ ఆధారంగా రూపొందించబడిన నాటకం, ఈ నాటకం ధనవంతుడు మరియు బీదవాడైన లాజరు యొక్క కథను వివరిస్తుంది అన్నారు. ఈ నాటకం ధనవంతుల యొక్క స్వార్థపూరిత జీవితాన్ని మరియు పేదల పట్ల వారి నిర్లక్ష్యాన్ని, పేదలను పట్టించుకోని వారు మరణానంతరం ఎలాంటి దుస్థితికి చేరుకుంటారో ఈ నాటకం ద్వారా ప్రజలకు ఆ దేవుడు తెలియజేయడం జరిగింది అన్నారు. ఇది కరుణ, దాతృత్వం మరియు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండవలసిన ప్రాముఖ్యతను మనిషిలోని గర్వాన్ని తగ్గించడానికి ఇటువంటి కథలు ప్రజలకు తెలియజేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల రవి, గుడ్డెటి మురళి,ప్రసన్న, గాజుల రాజు,మంద వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *