తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : PCPNDT చట్టం అమలులో భాగంగా జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ మరియు జిల్లా సలహా సంఘం యొక్క సంయుక్త సమావేశం ఈ రోజు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధ్వర్యంలో కలెక్టరేట్ లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ, జననానికి ముందు లింగ నిర్ధారణ (Sex Determination) చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు అనుమానిస్తున్న స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లపై డికాయ్ …
Read More »Daily Archives: April 25, 2025
పరిసరాల పరిశుభ్రత-ప్రజారోగ్యానికి తొలిమెట్టు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ V. బాలకృష్ణ నాయక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. మురుగునీటి నిల్వలున్న ప్రాంతాల్లో ఈ దోమల లార్వా వృద్ధి చెందుతుంది. మలేరియా జ్వరానికి మూలం ‘ప్లాస్మోడియం’ అనే పరాన్నజీవి. ఇది దోమలతో ముఖ్యంగా ఆడ అనాఫిలస్ దోమల ద్వారా ఒకరి నుంచి …
Read More »పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద టీం పోతిన మహేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమమును ఉద్దేశించి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ మానవత్వాన్ని మంటగలిపిన మారణకాండ అని ,ఇది పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదని, భారతదేశంపై జరిగిన దాడిగా, దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉగ్రవాదులు కుట్రపన్నీ నరమేధం సృష్టించారని ఈ …
Read More »ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28 వ తేది ఏ.పి సచివాలయం వద్ద వున్న వీఐటీ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరు అవుతున్న నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను శుక్రవారం రాత్రి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎస్.వి.కోటా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ , యూనివర్శిటీ రిజిస్ట్రార్ డా. జగదీష్ సి. మదిగంటి , ఆర్డిఓ కే.శ్రీనివాస రావు పరిశీలించారు. వీఐటీ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం …
Read More »ప్రధాని నరేంద్ర మోడి శంఖుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి మే 2 వ తేదిన తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపం అమరావతి పరిధిలో వివిధ శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృష్ట్యా అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జి. సతీష్ కుమార్, సెక్రెటరీ బీసీ వెల్ఫేర్ మల్లిఖార్జున, ఎండీ మెప్మా తేజ్ భరత్, డైరెక్టర్ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఎం.వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ …
Read More »రాష్ట్ర , జిల్లా స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర @ 2047 కు అనుగుణంగా జిల్లాలో నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్రణాళికలను నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్రణాళికను సిద్ధం చేయడంపై గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ఉద్యోగులకు (సీవీఎపీ ఎస్) నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ …
Read More »ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి రీ సర్వే పూర్తి చేయాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే ప్రక్రియ చేపట్డం లో నిబద్ధత, ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు(పి వి జి టి) గ్రూపులకు చెందిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయడం పై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి నట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలియ చేశారు. శుక్రవారం స్థానిక సుందర సాయి కళ్యాణ మండలంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొవ్వూరు ఆర్డీవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, భూముల సర్వే కు సంబంధించి …
Read More »ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీలో పాల్గొన్న MLA బొండా ఉమ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం లోని 60వ డివిజన్ వాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ వద్ద ఉన్న PHC హాస్పిటల్ నందు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం “మలేరియా అంతం మనతోనే” అంటూ అవగాహన కార్యక్రమం లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు పాల్గొని దోమల పుట్టకుండా, కుట్టకుండా నిర్మూలిద్దాం మలేరియా వ్యాధి సోకకుండా కట్టడి చేద్దాం అంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రజలకు …
Read More »స్త్రీల రిట్రీట్ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి స్త్రీల సమాజం వారు నిర్వహించిన స్త్రీల రిట్రీట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సతీమణి బొండా సుజాత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బొండా సుజాత మాట్లాడుతూ:-హింసా,ద్వేషాలు మరణాన్ని ఇస్తే, ప్రేమ క్షమాపణలు జీవితాన్ని ఇస్తాయని నిరూపించడానికి సమాధి నుండి సజీవుడై యేసు తిరిగొచ్చిన పవిత్ర బైబిల్ చెబుతుందని, క్రైస్తవులందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, నియోజవర్గ ప్రజలందరూ …
Read More »మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు 64వ డివిజన్ కండ్రిక నందు గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించి గర్భిణీ స్త్రీలకు చీర పసుపు కుంకుమ అందజేసి శ్రీమంతం చేసిన వారిని సత్కరించుకోవడం జరిగింది. శుక్రవారం 64 డివిజన్ కండ్రిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాకొల్లు. రవికుమార్ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటుచేసి మహిళలకు చీర పసుపు కుంకుమ అందజేసి భోజనాలు …
Read More »
Prajavartha Online Telugu News