కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రీ సర్వే ప్రక్రియ చేపట్డం లో నిబద్ధత, ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు(పి వి జి టి) గ్రూపులకు చెందిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయడం పై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి నట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలియ చేశారు. శుక్రవారం స్థానిక సుందర సాయి కళ్యాణ మండలంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొవ్వూరు ఆర్డీవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, భూముల సర్వే కు సంబంధించి పలు ఫిర్యాదులు నేపథ్యంలో రీ సర్వే ప్రక్రియ చేపట్డం జరుగుతోందని పేర్కొన్నారు. రీ సర్వే ప్రక్రియ చేపట్డం లో భూముల సర్వే కి సంబంధించి ఫిర్యాదుల పరిష్కారం నేపథ్యంలో సరిహద్దు భూ యజమానులు, రైతులు హాజరుకావాలని, క్షేత్ర స్థాయిలో అధికారులకి, సిబ్బంది కి తగిన రికార్డులు, వివరాలు అందించి సహకరించాలన్నారు. గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా రీ సర్వే ప్రక్రియ భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే రెండవ దశ సర్వే నిర్వహించి ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి రీ సర్వే పూర్తి చేయాలని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మండల గ్రామ స్థాయి సర్వే, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్డీవో కార్యాలయం లో నాబార్డ్ ఏజీఏం నాయుడు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి లతో కలిసి ఆర్డీవో సమీక్షించారు.
ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు(పి వి జి టి) గ్రూపులకు చెందిన వారికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేసే క్రమంలో ఇబ్బందులనీ గుర్తించినట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలియ చేశారు. ఇందు కోసం ఆయా కుటుంబాలతో మాట్లాడి వారందరికీ ఆధార్ కార్డు రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతోందని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లో ఆధార్ కార్డు నమోదు తప్పనిసరి అని వారికి అవగాహనా కల్పించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామ రెవెన్యూ, గ్రామ పంచాయతీ, సచివాలయం సిబ్బంది కి సూచనలు చేసినట్లు ఆర్డీవో తెలిపారు. పివిజిటి గ్రూపు లకు చెందిన వారు తగిన గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల ఆయా ప్రభుత్వ పథకాలను పొందుటకు సాధ్యం కాకపోవడం గుర్తించినట్లు తెలిపారు. ఆయా పివిజిటి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు ఉద్యోగులు, పివిజిటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News