Breaking News

స్త్రీల రిట్రీట్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం సెంట్రల్ నియోజకవర్గంలోని  59వ డివిజన్ సింగ్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి స్త్రీల సమాజం వారు నిర్వహించిన స్త్రీల రిట్రీట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు  సతీమణి బొండా సుజాత పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా బొండా సుజాత  మాట్లాడుతూ:-హింసా,ద్వేషాలు మరణాన్ని ఇస్తే, ప్రేమ క్షమాపణలు జీవితాన్ని ఇస్తాయని నిరూపించడానికి సమాధి నుండి సజీవుడై యేసు తిరిగొచ్చిన పవిత్ర బైబిల్ చెబుతుందని, క్రైస్తవులందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, నియోజవర్గ ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని, సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమామహేశ్వరరావు గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, NDA కూటమి ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను వివరించి, వారి బాగోగులు అడిగి తెలుసుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తనను ఆహ్వానించిన వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో:- ఎలవర్తి రాజ్యలక్ష్మి, షకీలా గ్లోరీ, స్త్రీల సమాజం కమిటీ మాకం బేబీ, సెక్రటరీ మాచర్ల విజయ్ కుమారి, ట్రెజరర్ కోలా సౌజన్య, తదితరులు పాల్గొన్నారు…

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *