Breaking News

ఏ ధర్మాన్ని ఆచరిస్తారని అడిగి మరీ చంపేశారు

-పెహల్గాం ఉగ్రవాద చర్యను భారత దేశం ఎన్నటికీ మరువదు
-అత్యంత కిరాతకంగా, నిర్దయగా ప్రవర్తించారు
-ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి పారేయాలి
-బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఇస్తుంది
-ఉగ్ర దాడిలో మృతి చెందిన కావలి వాసి మధుసూదనరావు సోమిశెట్టి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 
-కుటుంబ సభ్యులకు ఓదార్పు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘పహల్గాంలో ఉగ్రవాదుల దాడులు దారుణం. ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా, టార్గెటెడ్ గా పర్యాటకుల్ని హతమార్చారు. ఎంతో పైశాచికంగా ప్రవర్తించారు. ఈ ఘటనను భారత దేశం ఎప్పటికీ మరచిపోదు. మనకి కనికరం, మంచితనం ఎక్కువయ్యాయి. ఇక ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి వేయాలి’ అంటూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం శ్రీ పొట్టి శ్రీరామలు నెల్లూరు జిల్లా, కావలిలో పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సోమిశెట్టి మధుసూదన రావు
భౌతిక కాయానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ తో కలసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ.. “ఉగ్రవాదులు ఎంతో కిరాతకంగా దారుణంగా ప్రవర్తించారు. మధుసూదన రావు కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు వారు పడిన క్షోభను తెలియజేశారు. వారి ఆవేదన వింటే మనసు వికలమైంది. మాట్లాడడానికి మాటలు రావడం లేదు.
విశాఖ వెళ్లి  చంద్రమౌళి  కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన అనంతరం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించి అన్నీ వివరంగా మాట్లాడుతాను. ప్రభుత్వం అన్ని రకాలుగా మృతుల కుటుంబాలకు భరోసా ఇస్తుంది. వీరికి పరిహారం కంటే మనిషి చనిపోయిన బాధలో వారికి అండగా నిలవడం అవసరం. కశ్మీర్ లో పరిస్థితులు నాకు తెలుసు. 1986 నుంచి 1989 వరకు అక్కడ షూటింగ్ శిక్షణకు వెళ్లే వాడిని. కశ్మీర్ లో తూటాలు పేలితే ఆ ప్రభావం దేశం నలుమూలలా కనబడుతుంది అనడానికి పహల్గాంలో ఉగ్రదాడి ఉదంతమే నిదర్శనం. గత కొంత కాలంగా కశ్మీర్ లో ప్రశాంతం పరిస్థితులు ఏర్పడ్డాయని విహారానికి వెళ్లారు. మధుసూదన రావు కుటుంబానికి జరిగిన ఘటన ఇంకా నమ్మశక్యంగా లేదు. ఏ ధర్మాన్ని ఆచరిస్తారని అడిగి మరీ నిర్ధాక్షణ్యంగా చంపేశారు. రేపు, ఎల్లుండిల్లో మంగళగిరిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు వివరిస్తామ”న్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు  ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, శాసన సభ్యులు  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  దగుమాటి వెంకటకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు
మధుసూదన రావు  అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *