Breaking News

Monthly Archives: April 2025

పుడ‌మి త‌ల్లి రోదిస్తోంది

-ధ‌ర‌ణి మాత ఆరోగ్య ర‌క్ష‌ణ మ‌నంద‌రి స‌మిష్టి బాధ్య‌త‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాన‌వాళి సుఖ‌జీవనాభిలాష నానాటికీ పెరుగుతుండ‌టంతో త‌త్ప‌ర్య‌వ‌సానంగా నిరంత‌ర దాడుల‌కు గుర‌వుతూ స‌మ‌తుల్యం కోల్పోతూ అనునిత్యం ఆరోగ్య క్షీణ‌త‌కు గుర‌వుతున్న పుడ‌మి త‌ల్లి మౌనంగా రోదిస్తోంది. మాన‌వాళితో పాటు ల‌క్ష‌లాది ర‌కాల జంతువులు, ప‌క్షులు, మొక్క‌ల‌కు ఆశ్ర‌య‌మిచ్చే ధ‌ర‌ణి మాత బ‌ల‌హీన‌మ‌వుతూ బేల‌గా మారుతోంది. ఎల్ల‌లు లేని గ‌నుల త‌వ్వ‌కాలు, క‌నుమ‌రుగ‌వుతున్న ప‌చ్చ‌ద‌నం, మాయ‌మ‌వుతున్న జీవ‌ వైవిధ్యం, అడుగంటుతున్న భూగ‌ర్భ జ‌లాలు, క‌లుషిత‌మ‌వుతున్న న‌దీ జ‌లాలు, పెరిగిపోతున్న ఎడారీక‌ర‌ణ‌, …

Read More »

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 48 వ డివిజన్ లో రూ 15 లక్షల నిధులతో చేపడుతున్న సీ సీ రోడ్లు, మురుగు కాలువలు, మెట్లు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. గండి మహాలక్ష్మి వీధి రోడ్డులో సీ సీ రోడ్డు, సచివాలయం కొండ ప్రాంతంలో మెట్లు కాలువలకు రూ 15 లక్షల నిధులతో శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని …

Read More »

విజ‌య‌వాడ స‌మగ్రాభివృద్దితోపాటు సుందరీకరణకు ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నాము

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో కలిసి సీసీ రోడ్లు శంకుస్థాప‌న‌ -4వ డివిజ‌న్ లో ప‌లు సీసీ రోడ్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆధునీక‌ర‌ణ‌లో విజ‌య‌వాడ రూపు రేఖ‌లు మారుతున్నాయి.రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో భాగ‌మైన విజ‌య‌వాడ న‌గ‌రాన్ని మ‌రింత సుంద‌రీక‌ర‌ణగా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రజాప్ర‌తినిధులైన త‌మ‌తో పాటు, ప్ర‌భుత్వ అధికారుల‌ను ఆదేశించారు. అందులో భాగంలోనే విజ‌య‌వాడ ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్, బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, …

Read More »

సీఎం చంద్రబాబు సేవలను స్పూర్తిగా తీసుకుని నిస్వార్ధంగా సేవ చేస్తున్నాం… 

-నాయకులు స్పందించటం లేదు -పిఎమ్ కేఎం అధ్యక్షులు పసుపులేటి వెంకట రమణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సేవలను స్పూర్తిగా తీసుకుని టిడిపి పార్టీకి తాము నిస్వార్థంగా ఎటువంటి పదవులు అశించకుండా పలు సేవలు చేస్తూన్నామని అయితే తమకు పార్టీ పెద్దలు తగిన తోడ్పాటు ఇవ్వకపోవటం అవేదన కలిగిస్తుందని పిఎమ్ కేఎం అధ్యక్షులు పసుపులేటి వెంకట రమణ తెలిపారు. సోమవారం గాంధీ నగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వజ్రోత్సవ వేడుక …

Read More »

ఆసక్తి ఉన్నరోజువారీ వేతనంపై కార్మికులు నమోదు చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని, ఆసక్తి కల్గిన వారు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ లో నేరుగా లేదా 08632345103 కి కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దుకోవాడానికి …

Read More »

స్థానిక సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ కమిషనర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీల్లోని ఫిర్యాదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ బర్త్ అండ్ డెత్ విభాగం వద్ద పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …

Read More »

స్వచ్చ అంధ్ర స్పూర్తితో స్వచ్చ గుంటూరు సాధనకు నగర ప్రజలు కూడా పూర్తీ స్థాయిలో సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మెరుగైన పారుశుధ్య పనులు చేపట్టేలా నగర కమిషనర్ నేతృత్వంలో పటిష్ట కార్యాచరణ మేరకు కృషి జరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజారోగ్య విభాగానికి అవసరమైన 6 ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇంచార్జి మేయర్ షేక్ సజిలా, శాసన సభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి లతో కలిసి ప్రారంభించారు. …

Read More »

ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో రైతాంగం సంతృప్తి

-ధాన్యం వివరాలు, రైతాంగం సమస్యలపై అన్నదాతలతో మంత్రి కందుల దుర్గేష్ ఆరా -రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ -ఆన్లైన్ లో ధాన్యం కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్ విధానం 7337359375 వాట్సాప్ నెంబర్ -చివరి బస్తా వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో రైతాంగం సంతృప్తిని వ్యక్తం చేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల …

Read More »

అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు

-పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లను ప్రారంభించడం పట్ల ప్రజల నుంచి ప్రశంసలను అందుకోవడం జరిగిందనీ జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి డా నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం మునిసిపల్ కార్పొరేషన్ సమీపంలోని అన్నా క్యాంటీన్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామా నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత …

Read More »

జి జి హెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం మధ్యాహ్నం ఐసోలేషన్ వార్డును పరిశీలించిన, అనంతరం మాతా శిశు సంరక్షణ వార్డు, క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు పురోగతి పై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్ లక్ష్మీ సూర్య ప్రభను వివరాలు అడిగి తెలుసు కోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు ను తగిన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసుకోవాలని కోరారు.. …

Read More »