Breaking News

ఆర్ధిక వృద్ధిలో రాష్ట్రం రెండోస్థానంపై ముఖ్యమంత్రి సంతోషం

-అధికారులకు బహుమతిగా అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌లు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్ధిక వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌ను, అధికారులను అభినందించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడిలో పడినందుకు ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్ధిక-ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులను సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆర్ధిక శాఖా మంత్రి ముఖ్యమంత్రితో భేటీకి హాజరు కాలేకపోగా… తనను కలిసిన రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పలువురు ఆర్ధిక శాఖ, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులకు బహుమతిగా అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌లు అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *