విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లోని సంగీత ప్రియులను అలరించే విధంగా ఈ నెల 6 నుండి 8 వరకూ ” కృష్ణవేణి సంగీత నీరాజనం” పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసులు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమీ మరియు రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజులు పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సంగీత కళాకారులు పాల్గొంటారని వినయ్ చంద్ తెలిపారు.
కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాలు విజయవాడ లోని మూడు ప్రాంతాలు 1. తుమ్మలపల్లి కళాక్షేత్రం 2. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 3. కృష్ణా రివర్ ఘాట్ ప్రాంతాలలో నిర్వహించనున్నామని, ఈ సంగీత ఉత్సవ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కె. పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ముఖ్య అతిధులుగా పాల్గొన నున్నారని అయన తెలిపారు. ఈ సంగీత ఉత్సవ కార్యక్రమం డిసెంబర్ 6న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించనున్నామని అయన తెలిపారు. డిసెంబర్ 6 నుండి 8 వరకూ విజయవాడ లోని మూడు ప్రాంతాలలో గల కళా వేదికలలో సంగీత ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసులు పర్యాటక సాంస్కృతిక శాఖల కార్యదర్శి వి. వినయ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …