– ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి
– మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ ఎస్‌కే ఫర్జానా బేగం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత డీఎస్‌సీ శిక్షణకు అర్హులైన మైనారిటీ విద్యార్థుల (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్.కె.ఫర్జానా బేగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. www.apcedmmwd.org వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్, స్వాతి థియేటర్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ-520012 (ఫోన్: 0866 – 2970567)లో సంప్రదించాలని సూచించారు.
Prajavartha Online Telugu News