Breaking News

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

-విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం పెంచాలి
-పేరెంట్స్ మీట్లో ఎం ఎల్ ఏ,, సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేసి విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం పెంచాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పిల‌పునిచ్చారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్, అండ్ టీచర్స్ మీటింగ్ వన్ టౌన్ లోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం ఎల్ ఏ సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రూపకల్పన చేసిన మెగా పేరెంట్స్, అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ప్రతిభ గురించి అవగాహన వస్తుందన్నారు. ఎన్టీఆర్ వంటి మ‌హ‌నీయులు చ‌దివిన గాంధీజీ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరియు విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం పెంచాలని అధ్యాపకులను కోరారు. టీచర్ల, అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధించాలని ఉద్భోదించారు. అందుకు ప్రత్యేక దృష్టి పెట్టి టీచర్లు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.అందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. గాంధీజీ పాఠశాలను మోడల్ స్కూల్ గా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యాల కమిటీ చైర్మన్ జెట్లింగ్ శంకర్, ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున రెడ్డి, ఎంఇఒ సోమశేఖర్ నాయక్, ఎ ఎం ఒ అశోక్, నరసింహ చార్యులు, ప్రియ ,పేరెంట్స్ కమిటీ చైర్మన్ కొత్తమాసు వెంకట పిచ్చయ్య, కూటమి నేతలు ఎమ్ ఎస్ భేగ్, ఆడ్డూరి శ్రీరామ్, పైలా సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *