విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్.బి.కాలనీ 300 & 450sft ఫ్లాట్స్ ఓనర్స్ & రెంటల్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ని నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ లు మాట్లాడుతూ మా కాలనీ అభివృద్ధికి సహకరించాలి అని ఎంపీని అడగడం జరిగింది. దీనికి ఎంపి స్పందించి అందరం కలిసికట్టుగా నడిచి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, మాజీ కార్పొరేటర్ యెదుపాటి రామయ్య, 300 & 450 sft కాలనీ అధ్యక్షులు సేత చంద్ర శేఖర్, అజీజ్, లక్ష్మి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News