-సొంత నిధులతో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఉచిత భోజన వసతి సదుపాయం కల్పించిన సుజనా
-ఆరంభమే … మరికొన్ని పథకాలు చేపడతాం..
-పశ్చిమ సమగ్రాభివృద్దే లక్ష్యం
-ఎం ఎల్ ఏ సుజన చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామని ఎం ఎల్ ఏ సుజన చౌదరి అన్నారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబేళా సమీపంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో విద్యాన్నపూర్ణ పథకాన్ని సుజనా చౌదరి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించే బ్రహత్కర కార్యక్రమానికి సుజనా చౌదరి శ్రీకారం చుట్టారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యాహ్న భోజన కార్యక్రమాన్ని సుజనా చౌదరి ప్రారంభించారు. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటనలో భాగంగా ఉర్దూ జూనియర్ కళాశాలను సుజనా చౌదరి సందర్శించి కళాశాల మౌలిక సదుపాయాలు మరియు విద్యార్థుల గురించి ఆరా తీశారు. 188 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్న ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం కోసం విద్యార్ధుల అవస్థలు తెలుసుకొని తమ కార్యాలయ ఇన్ చార్జి తో వివరాలు తీసుకుని విద్యార్థులకు మధ్యాహ్న సమయంలో భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కళాశాల నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సుజనా విద్యాన్నపూర్ణ పథకాన్ని శనివారం లాంఛనంగా ప్రారంబించారు. విద్యార్థులకు భోజనాన్ని సుజనా చౌదరి స్వయంగా వడ్డించారు. ఇక నుంచి ప్రతిరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందని భరోసా ఇచ్చారు. దీనితో పాటు మరి కొన్ని కళాశాలలో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ జూనియర్ కళాశాల అభివ్రుధ్దికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. సుజనా ఫౌండేషన్ ద్వారా పశ్చిమ నియోజకవర్గం లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్యా, వైద్య రంగాలని అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించిన పశ్చిమ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పశ్చిమాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో పశ్చిమాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎం ఎల్ ఏ సుజనా చౌదరి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు చక్రధరి దాస్, రామ రాఘవ దాస్, కళాశాల ప్రిన్సిపల్ షేక్ అహ్మద్, డిఎంఇఒ రెడ్డి కూటమి నాయకులు ఎంఎస్ బేగ్, నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్, బబ్బూరి శ్రీరామ్, మైలవరపు కృష్ణ, నాగోతి రామారావు, ఏలూరి సాయి శరత్, పైలా సురేష్, రెడ్డిపల్లి రాజు, కత్తెర ప్రదీప్, చింతా బాబి, మంతెన తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News