-తల్లిదండ్రులకు స్వయంగా రూ. లక్ష అందచేసిన గద్దె అనురాధ, గద్దె క్రాంతికుమార్
-నాగ హర్షిత వైద్య ఖర్చుల కోసం దాతలు సహకరించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ రామలింగేశ్వనగర్‌కు చెందిన తోట గోపి, తోట పద్మావతి దంపతుల 11 ఏళ్ళ కుమార్తె నాగ హార్షిత ఇటీవల ప్రమాదానికి గురై నగరంలోని రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నాగ హర్షితను కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ గద్దె అనురాధ, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ స్వయంగా పరామర్శించారు. నాగ హర్షిత వైద్య ఖర్చుల నిమిత్తం తన సొంత నిధుల నుంచి లక్ష రూపాయలను నాగహర్షిత తల్లిదండ్రులకు అందచేశారు. నాగ హర్షిత వైద్య చికిత్సలు త్వరగా పూర్తి చేసుకుని పూర్తిస్థాయిలో కోలుకోవాలని గద్దె అనురాధ, గద్దె క్రాంతికుమార్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయం అందిస్తుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి నిధులను కూడా మంజూరు చేయించి వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆదుకుంటారని చెప్పారు. ప్రభుత్వ పరంగా సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి సహాయం అందడం ఆలస్యం అయితే తన సొంత నిధులతో నియోజకవర్గంలోని ప్రజలకు సహాయం చేస్తూ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అండగా ఉంటారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజల సంతోషం, ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులను ఖర్చు చేస్తున్నారని చెప్పారు. నాగహర్షిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని గద్దె అనురాధ చెప్పారు.
గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ నాగహర్షితకు యాక్సిడెంట్ అయిన విషయం తెల్సుకుని వారి తల్లిదండ్రులను సంప్రదించి తామే స్వయంగా వచ్చి ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. వరదల సమయంలో నగరంలోని ప్రజలను ఆదుకోడానికి దాతలు అండగా నిలిచిన విధంగానే చిన్నారి నాగహర్షిత వైద్యచికిత్స కోసం సహాయం చేయడానికి దాతలు కూడా ముందుకు రావాలని గద్దె క్రాంతి కుమార్ కోరారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అండగా ఉంటున్నారని చెప్పారు. ఆయన అడుగు జాడల్లోనే తాను కూడా నడుస్తూ నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ దృష్టికి తీసుకువస్తే వెంటనే ఆయన పరిష్కారమార్గం చూపుతారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దాడి సుబ్బారావు, గద్దె రమేష్, గద్దె హేమన్స్, రామకృష్ణ, వాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.