-నిండు మనస్సుతో అభిమానం చాలు –
-పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు తీసుకురండి –
-రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేద విద్యార్థులకు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తనను కలిసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, గజమాలలు, పూల దండలు, దుశ్శాలువలు తీసుకురావద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిండు మనస్సుతో అభిమానంతో శుభాకాంక్షలు చాలు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బొకేలు, పూల మాలలు, దుశ్శాలువలు తెచ్చే వారు అదే ఖర్చుతో “చదువుకునే పేద విద్యార్థులకు” ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి ఏటా మంత్రి అచ్చెన్నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు వస్తుంటారు.