-మణిపాల్ హాస్పటల్ ,జివిఆర్ ట్రస్ట్ సేవలు హర్షదాయకం
-ప్రజలకు పూర్తి ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి
నూజివీడు/చాట్రాయి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో విజయవాడ మణిపాల్ హాస్పటల్, జివిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. సందర్భంగా వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన సాధారణ వైద్య పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు, కంటి పరీక్ష, గుండె పరీక్ష, ఊపిరితిత్తుల, పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు.వైద్యులు నిర్వహించే వైద్య పరీక్షల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులను పేరు పేరున పలకరించి వారు ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ డబ్భులు లేక ఏ ఒక్క పేద వాడు మెరుగైన వైద్యానికి దూరం కాకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద ప్రజలు కొన్ని కొన్ని రోగాలకు ఎన్టిఆర్ వైద్య సేవలో ఉన్నప్పటికి వాటిపై సరైన లేని కారణంగా హాస్పటల్లో వైద్యం చేసుకోవడంతో ఆర్ధికంగా నష్టపోతున్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్ధిక సహాయం అందచేసి వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రేవేటు సంస్థలు, స్వచ్చంద సేవాసంస్థలు అందించే ఈ మెగా వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మణిపాల్ హాస్పటల్ ,జివిఆర్ ట్రస్ట్ వారికి మంత్రి పార్థసారథి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుకు మరిన్ని స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు.ప్రస్తుత నాగరిక సమాజంలో మానవుల యొక్క జీవన శైలి ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారన్నారు. ఏఒక్క చిన్న రుగ్మతను అజాగ్రత్తగా చూడకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు.దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఇంటింటికి సర్వే చేయించి రోగ నిర్ధారణ ,నిరోధక చర్యలు చేపడుతుందన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యం కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గత 4 నెలల క్రితం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం పొందవచ్చునని రాష్ట్ర మంత్రి పార్థసారథి అన్నారు .పేద ప్రజలు డబ్భులు లేక వైద్యనికి దూరం అవ్వకూడదని అన్ని రకాల రోగాలను ఎన్ టి ఆర్ వైద్య సేవలో ప్రభుత్వం పొందుపరిచామని దానిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి తుంగలో తొక్కిందని ముఖ్యమంత్రి సహాయ నిధినుండి ఒక్క రూపాయి కూడా పేద ప్రజలకు అందజేయలేదని ఎద్దేవ చేశారు .పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్న ప్రభుత్వము మాది అన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి అందించిన విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ప్రజల ఆశలు , ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. పేదలకు పెన్షన్ ను 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచడమే కాక 3 నెలల బకాయిలను కూడా జులై, 1వ తేదీనే అందించారన్నారు.
కార్యక్రమంలో మణిపాల్ హాస్పటల్ ,జివిఆర్ ట్రస్ట్ ప్రతినిధులు,వైద్యులు, తెలుగుదేశం, జనసేన,భాజపా, నాయకులు కార్యకర్తలు, గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.