-మేరీ మాత ఉత్సవ ఏర్పాట్లపై చర్చ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం
-ఉత్సవాలకు విజయవాడ బ్రాండ్ అంబాసిడర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్సవాలకు విజయవాడ బ్రాండ్ అంబాసిడర్..విజయవాడ వైభవాన్ని దసరా నవరాత్రి ఉత్సవాలు, గుణదల మేరీ మాత ఉత్సవాలు చాటి చెబుతాయి. ఫ్రిబవరిలో జరగబోయే గుణదల మేరీ మాత ఉత్సవాలకు అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం వుంటుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గుణదల మేరీమాత ఉత్సవ ఏర్పాట్లు కు సంబంధించి ప్రభుత్వం తరఫున కావలసిన సహాయ సహకారాలు తెలుసుకునేందుకు ఎంపి కేశినేని శివనాథ్ ఆదివారం గుణదల చర్చ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఎంపి కేశినేని శివనాథ్ కి ఫాదర్ విలియం జయరాజ్ ఏలేటి తో పాటు కౌన్సిల్ సభ్యులు స్వాగతం పలికారు. ముందుగా ఫాదర్ విలియం జయరాజ్ ఏలేటి ఆధ్వర్యంలో ఎంపి కేశినేని శివనాథ్ మేరీమాత విగ్రహాం ముందు ప్రార్థన చేశారు.
సమావేశం అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా మేరీమాత ఆశీస్సుల కోసం అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఫాదర్ విలియం జయరాజ్ ఏలేటి, కౌన్సిల్ సభ్యులతో ఉత్సవ ఏర్పాట్లపై చర్చించటం జరిగిందన్నారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాల్సిందిగా కౌన్సిల్ సభ్యులు కోరటం జరిగింది. వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఉత్సవాలంటేనే విజయవాడ కాబట్టి దేశంలోని భక్తులందరూ మేరీ మాత ఆలయానికి విచ్చేసి ఆశీస్సులు తీసుకునే విధంగా ఆలయాన్ని అభివృద్ది చేయాలని ఫాదర్ ను కోరటం జరిగిందన్నారు. అభివృద్ది విషయంలో ప్రభుత్వం తరుఫున సహాయం కావాలంటే ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని చెప్పినట్లు పేర్కొన్నారు. టూరిజం క్యాపిటల్ లో రీజనల్ టూరిజం రిలీజియస్ట్ టూ రిజం ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు.రిలీజియస్ట్ టూరిజం లో మేరీమాత ఆలయం ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
అనంతరం ఫాదర్ విలియం జయరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ఉత్సవాలకు సహాయ సహకారాలు అందించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ విచ్చేసి మాట్లాడటం సంతోషంగా వుందన్నారు. గత వందేళ్ల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల వారు సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఎంపి కేశినేని శివనాథ్ చెప్పిన కొన్ని అంశాలపై పీఠాధిపతులతో చర్చించి సమాచారం తెలియజేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గుణదల చర్చి ప్రెసిడెంట్ నువ్వుల విజయబాబు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి జోసెప్ బాట్టిస్తా, కోశాధికారి గోలి విజయానంద్ జోసెప్ , సభ్యులు జి.రవి కుమార్, జి.ఎస్.పరంపోగు చైతన్య, పిల్లి చిరస్తు దాసు, సేవ అబ్రహం, దాసరి సిల్వ ప్రసాద్, బండి జయరాజు, జి. బాల బాబుజీ, సి.అరుణ కుమారి, జి.యేసు దీవెనమ్మ లతోపాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.