-నూతన కమిటీకి రెడ్‌క్రాస్ అధ్యక్షులు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్‌టీఆర్ జిల్లా శాఖ ఛైర్మన్‌గా జాస్తి సత్యనారాయణ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాఖ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 31వ తేదీన రెడ్‌క్రాస్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో జిల్లా రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీకి పదిమంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు తెలిపింది. జాస్తి సత్యనారాయణ చౌదరి, డా. వి.నారాయణరావు, కొల్లి నాగేశ్వరరావు, పి.సాయిబాబా, అట్లూరి సుమబిందు, మన్యం వెంకట జగన్నాథ్, డా. ఇళ్ల రవి, బి. అనిల్ కుమార్, డా. బి.శివహరి ప్రసాద్, శీతల్ జైన్‌లు నూతన సభ్యులుగా ఎన్నికకాగా.. బుధవారం రెడ్‌క్రాస్ కార్యాలయంలో సమావేశమై జాస్తి సత్యనారాయణ చౌదరిని ఛైర్మన్‌గా, డా. వి.నారాయణరావును వైస్ ఛైర్మన్‌గా, డా. ఇళ్ల రవిని ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు తెలిపింది. కొత్తగా ఎన్నికైన సభ్యులకు రెడ్‌క్రాస్ అధ్యక్షులు, కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు తెలిపారు.