-కలిసి కట్టుగా అడుగులు వేద్దాం
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సర వేళ ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను, ప్రజా ప్రయోజన పథకాలను అమలు చేయడంలో నూతనోత్సాహంతో పని చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టర్ ఛాంబర్ లో సాదాసీదాగా నూతన సంవత్సర వేళ అభినందనలు అందజేసేందుకు తనను కలిసిన అధికారులతో కలెక్టరు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అమలు చేయడం జరుగుతోందనీ, వాటిని విజయవంతంగా ప్రజలకి చేరవేయడం లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నూతన సంవత్సర దినోత్సవ స్ఫూర్తితో సమిష్టిగా పని చెయ్యడం ద్వారా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా సమిష్టిగా అడుగులు వేద్దాం అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా కలెక్టర్ ను కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఆర్డీఓ లు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, ఇతర శాఖల అధికారులు, అధికార, అనధికారులు కలవడం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన కారణంగా సంతాప దినాలు నేపధ్యంలో ఆడంబరాలకు దూరంగా నూతన సంవత్సర కార్యక్రమాన్ని నిర్వహించారు.