అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు, వివిధ శాఖాధిపతులు,సచివాలయం,ఇతర విభాగాల అధికారులు ఉద్యోగులు,పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధానంగా డిజిపి ద్వారకా తిరుమల రావు,ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు,ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా,కాంతిలాల్ దండే, జయలక్ష్మి,సునీత,శశిభూషణ్ కుమార్,కార్యదర్శులు,కలక్టర్లు,జెసిలు,వివిధ శాఖాధిపతులు, సచివాలయ ఉద్యోగులు,ఎపి రెవెన్యూ సర్వీసెస్,ఎపి ఎన్జిఓ తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉన్నారు.
Tags amaravathi
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …