-రాష్ట్ర ప్రగతిపై చర్చించిన ఇరువురు నేతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందించి ఆంగ్లనూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ సందర్భంగా సచివాలయం విచ్చేసిన మంత్రి దుర్గేష్ మధ్యాహ్నం రెండో బ్లాక్ మొదటి ఫ్లోర్ లోని మంత్రి నాదెండ్ల మనోహర్ ఛాంబర్ వద్దకు వెళ్లారు.. అనంతరం రాష్ట్ర ప్రగతి, నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర పర్యాటకాభివృద్ధిపై ఇరువురు నేతలు పలు అంశాలు చర్చించారు.