Breaking News

పొదుపు సంఘాల సమైక్య సభ్యులతో సమీక్ష సమావేశం

-ఆర్థిక అభివృద్ధికై సూచనలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల సాధికారదే లక్ష్యంగా పొదుపు సంఘాల అభివృద్ధికై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం నాడు 16 డివిజన్ రామలింగేశ్వర నగర్ కమ్యూనిటీ హాల్ నందు ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటనారాయణ, ఆర్పీలతో విక్టరీ టౌన్ లెవెల్ ఫెడరేషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఎలా, వారు తీసుకున్న లోన్లతో వారికి ఉపాధి ఎలా కలుగుతుంది వంటి విషయాలపై చర్చించారు. విక్టరీ సమైక్యవారు వారు వారు తీసుకున్న లోన్ల గురించి, పొదుపు గురించి ప్రభుత్వం వారి సంక్షేమ పథకాల గురించి సభ్యులతో చర్చించారు. ఈ సమావేశంలో విక్టరీ టౌన్ లెవెల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు గాయత్రి, జిల్లా సమైక్య ప్రెసిడెంట్ మీనాక్షి, విజయవాడ నగరపాలక సంస్థ సి ఓ లు, పొదుపు సంఘాల ఆర్పీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *