Breaking News

 వికలాంగులకి సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత

-తెలంగాణ జోనల్ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
లూయిస్ బ్రెయిలీ 216వ బ్రెయిలీ జయంతి ఉత్సవాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోనల్ ఆఫీసులో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ దినేష్ కుమార్ గారు సభా అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తెలంగాణ జోన్ (బ్యాంకు పరిపాలన పరంగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని హైదరాబాద్ జోనుగా జోనుగా పిలుస్తుంది) మొత్తానికి జనరల్ మేనేజర్  అజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ వికలాంగులకి సమాన అవకాశాలు కల్పించడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని అన్నారు నేను నేను పనిచేస్తున్న క్రమంలో అనేక మంది వికలాంగుల ఉద్యోగులనుతో కలిసి పని చేసినటువంటి అనుభవంలో వారి నుండి ఒక చక్కటి మనోధైర్యం నేర్చుకున్నానని శరీర అవయవ లోపం ఉన్నప్పటికీ శరీర అవయవ లోపంతో కృంగిపోకుండా బాధపడకుండా పట్టుదలతో పనిచేసేటువంటి ఎంతోమంది విభిన్న ప్రతిభావంతులైన( డిఫరెంట్లీ ఏబుల్) ఉద్యోగుల నుండి ప్రేరణ పొందే వాళ్ళ మేమందరం అని వాక్యానించారు అందరికీ సమానమైన మానసిక శారీరక శక్తిసామర్థ్యాలు సమానంగా ఉండవని వైకల్యం అనేది కేవలం అది ఒక శారీరకపరమైనటువంటి సమస్య మాత్రమే మానసికపరమైనటువంటి శక్తిసామర్థ్యానికి శారీరక వైకల్యం అడ్డంకి కాదని చాలామంది నిరూపించారని వారి నుండి మనందరం ప్రేరణ పొందాలని అన్నారు ఐదవ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వికలాగా అర్థం చేసుకోవడంలోనూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడంలోనూ వారిని ప్రోత్సహించటంలోనూ వారికి సమాన అవకాశాలు కల్పించడంలో ముందు వరసలో ఉంటుందని అజయ్ కుమార్ సార్ అన్నారు, డెప్యూటీ డిప్యూటీ జోనల్ మేనేజర్ వెంకట నాగేష్ మాట్లాడుతూ వైకల్యాలు కలిగినటువంటి ఉద్యోగులకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి ప్రాధాన్యతను కల్పిస్తుందని ఉద్యోగులనే కాకుండా వైకల్యాలు కలిగినటువంటి కస్టమర్లకు కూడా వారి వైకల్యాలను దృష్టిలో పెట్టుకొని వారికి తగిన రీతిలో ప్రాథమిక ప్రాముఖ్యతని కల్పిస్తుందని అందులో భాగంగానే దృష్టిలోపం గల ఉద్యోగులని కస్టమర్లని దృష్టిలో పెట్టుకొని భారతదేశ బ్యాంకింగ్ రంగంలోనే మొట్టమొదటిసారిగా బ్రైలీ లిపిలో ముద్రించినటువంటి స్పర్శ డెబిట్ కార్డు పేరుతో ప్రత్యేకమైనటువంటి ఏటీఎం కార్డుని దృష్టి వైకల్యం కలిగినటువంటి కస్టమర్లు సౌకర్యం కోసం రూపొందించడం జరిగింది వైకల్యం కలిగినటువంటి ఉద్యోగుల పట్ల బ్యాంకు మేనేజ్మెంట్ ఎల్లప్పుడు సానుకూల దృక్కోణంలో వ్యవహరిస్తామని అన్నారుఅన్నారు అనంతరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం 2016 వికలాంగులకు సమాన హక్కులు సమాన అవకాశాలు కల్పించింది వాటిని మనం అమలు చేయాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంటుందని అంటూ వికలాంగులకు సమాన అవకాశాలు కల్పిస్తే వికలాంగులు అద్భుతాలు సృష్టిస్తారని 2024 పారా ఒలంపిక్స్ ఫలితాలు నిరూపించాయని మనం గమనించాలన్నారు, పారిస్ లో జరిగినటువంటి 2024 సకలాంగులు పార్టిసిపేట్ చేసినటువంటి ఒలంపిక్స్ లో పథకాల వేటలో భారతదేశం ఒక స్వర్ణం ఐదు కాoస్య పథకాలతో 71 స్థానంలో నిలిచిందని అలాగే వికలాంగులు పాటిస్పేట్ చేసినటువంటి పారా ఒలంపిక్స్ 2024లో భారతదేశం ఏడు గోల్డ్ మెడల్స్ 9 సిల్వర్ మెడల్స్ 13 కంచు  మెడల్స్ మొత్తం 29 మెడల్స్ తో భారతదేశం 18వ స్థానంలో నిలిచిందన్నారు

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజశ్రీ మేడం, చీఫ్ మేనేజర్ రవికుమార్, జోనల్ కార్యాలయ సిబ్బంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు ఆర్. స్వామి నాయక్ మరియు రాష్ట్ర నాయకత్వం హరిలాల్ రంగప్ప, శివదేవ్ సింహాచలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *