మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సత్వరమే నిధులు విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో అమలు చేస్తున్న పథకాల వారిగా, జిల్లాలో వాటిని అమలు చేసే శాఖల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని, దీనిపై సమీక్షించడం జరుగుతుందన్నారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనం ద్వారా గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య పరీక్షలు నిర్వహించుటకు షెడ్యూల్ రూపొందించాలని డిఎం అండ్ హెచ్వో ను ఆదేశించారు. పిజిఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలు గడువు దాటినవి కలెక్టర్ సమీక్షిస్తూ వ్యవసాయ శాఖ సివిల్ సప్లై కార్పొరేషన్ మచిలీపట్నం నగర పాలక సంస్థలో కొన్ని పెండింగ్ ఉండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ సత్వరమే పరిష్కరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరుకాని పక్షంలో, క్రింది స్థాయి అధికారులు సరైన సమాచారంతో హాజరుకావాలని సూచించారు.
డిఆర్ఓ కె చంద్రశేఖర రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జిల్లాలకు అందిన అర్జీల పరిష్కారానికి సంబంధించి ఆయా శాఖలు జిల్లా కలెక్టర్ వారి ఎండార్స్మెంటుతో పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు. వివిధ శాఖల్లో కోర్టు కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
మీకోసం అర్జీలలో….
బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి పంచాయతీలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తూ 2020లో మరణించిన తన తండ్రి స్థానంలో కారుణ్య నియామక ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఈద రాజకుమార్ అర్జీ సమర్పించారు. మొవ్వ మండలం కాజా శివారు రాచర్ల పాలెం నివాసి కటకం వెంకటేశ్వరావు చేనేత పింఛన్ మంజూరు చేయాలని, కృత్తివెందుకు చెందిన కేతినిడి వెంకట నాగ రవి కిషోర్ పూర్వం నుండి తన ఇంటికి గల దారిని, పంట బోదె ను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
గుడివాడ మండలం గంగాధరపురం గ్రామపంచాయతీ పరిధిలో మాటూరి శ్రీశిల్ప తమ భూమి నాలుగు ఎకరాల 20 సెంట్లు వ్యవసాయ భూమి 22a నిషేధిత జాబితా నుండి తొలగించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవో కే స్వాతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, డిఎంహెచ్వో డాక్టర్ సర్మిష్ట, డ్వామా పీడీ ఎన్వి శివప్రసాద్ యాదవ్, డీఎస్ఓ వి పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News