-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా దిశ కమిటీకి దగ్గుబాటి పురందేశ్వరి, పార్లమెంటు సభ్యురాలు, రాజమహేంద్రవరం వారిని అధ్యక్షురాలుగా నియామించుచూ ప్రభుత్వము వారు ఉత్తర్వులు జారీచేసియున్నారని ఈ మేరకు రాజమండ్రీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన జనవరి 9 వ తేది న సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లాలో వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ పధకములు అమలులో భాగముగా జిల్లా అభివృధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశము జనవరి 9వ తేదీ గురువారం మధ్యాహ్నాం 3.00 గంటలకి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించుటకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కావున సదరు దిశ సమావేశమునకు అందరు గౌరవ సభ్యులు మరియు తూర్పుగోదావరి జిల్లా అధికారులు (వారి వారి శాఖలకు సంబందించిన పూర్తి సమాచారముతో) తప్పక హాజరు కావలసినదిగా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో అజెండా అంశములుగా ఆయా శాఖలు అమలు చేయుచున్న పధకముల అభివృద్ధి పై సమీక్ష మరియు అధ్యక్షుల వారిచే ప్రతిపాదించు ఇతర అంశములను సమీక్షించడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు.