విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన వల్లూరు భార్గవ్ గారి ఆర్థిక సౌజన్యంతో ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి.గురునాధం, నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు చేతుల మీదుగా ఇటీవల కండ్రికలో రోడ్డు ప్రమాదానికి గురైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎస్ కే జాఫర్ షరీఫ్ కు విజయవాడ నగర కాంగ్రెస్ కార్యాలయం నందు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.
తదననంతరం ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి.గురునాథం మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేసిన వల్లూరు భార్గవ్ గారి సేవా హృదయం కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు..
నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని అందుకు నిదర్శనమే కార్యకర్తకు ఈ విధంగా ఆర్థిక సహాయం చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ జనరల్ సెక్రెటరీ ఎస్కే అన్సారి, తుళ్లూరు మండల అధ్యక్షుడు బొర్రా రవి, ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, మేళం చిన్న తదితరులు పాల్గొన్నారు.