-జిల్లా కలెక్టర్ డి.కే.బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కే.బాలాజీ తెలిపారు. జనవరి,07వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జనవరి 12వ తేదీ వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా జనవరి 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను జనవరి 20వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ప్రకటన ద్వారా ఆదేశించారు.
Prajavartha Online Telugu News