మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, కలెక్టర్ డిఆర్ఓ కే చంద్రశేఖరరావు లతో కలిసి మచిలీపట్నం బచ్చుపేట లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నెంబర్ 4 సందర్శించి, విద్యార్థినీలకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్, స్కేల్, జామెంట్రీ బాక్స్, కొబ్బరి నూనె, పేస్ పౌడర్, హెయిర్ పిన్స్, టవల్, నాప్కిన్ లతో కూడిన కిట్స్ అందజేశారు. హాస్టల్లో ప్రతిరూముకు మస్కిటో రీఫిల్స్ మెషిన్ తో అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ ల్ల లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని, పౌష్టికాహారంతో కూడిన మెనూతో భోజనం అందిస్తున్నదని వీటిని సద్వినియోగం చేసుకొని బాగా కష్టపడి చదివి వృద్ధిలోకి రావాలని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించి వారు భవిష్యత్తులో వారి లక్ష్యాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే లక్ష్యాలు నిర్దేశించుకుని లక్ష్యసాధనకు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. పాఠ్యపుస్తకాలు చదవడం అలవర్చుకొని విషయ జ్ఞానం పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ ముద్రిస్తున్నదని, తద్వారా ఇంగ్లీష్ భాష కూడా నేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థినిలలో చాలామంది నర్సింగ్ కోర్సు చేయాలని తమ ఆకాంక్ష వెలిబుచ్చగా, ప్రస్తుతం జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం అర్హత కలవారికి శిక్షణ ఇస్తున్నదని, విదేశాల్లో కూడా అవకాశాలు మెండుగా లభిస్తాయి అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ జన్మదినం పురస్కరించుకొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. తాసిల్దార్ మధుసూదన్ రావు, ఏ ఎస్ డబ్ల్యూ ఓ శీలం రాజశేఖర్ రెడ్డి, హెచ్ డబ్ల్యు ఓ సూర్య బేగం పాల్గొన్నారు.