Breaking News

ఈ నెల 12 నుండి 15 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జిఎంసి సంక్రాంతి సంబరాలు

-మంగళవారం స్టేడియంలో సంబరాల బ్రోచర్ ని ఆవిష్కరించిన నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గల్లా మాధవి, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కార్పొరేటర్లు, అధికారులు
-అధికారులు, ప్రజా ప్రతినిధులు, నగర ప్రముఖులతో సంబరాల నిర్వహణ కమిటి ఏర్పాటు
-12 వ తేదీ నుండి 15 వరకు తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి తెలిపిలే అంగరంగ వైభవంగా జిఎంసి సంక్రాంతి సంబరాలు
-తంబోలా, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, లెమన్ & స్పూన్ పోటీల్లో పాల్గొనే వారు మంగళవారం సాయంత్రం నుండి ఎన్టీఆర్ స్టేడియంలో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏర్పాట్లు
-మీడియా మిత్రులకు క్రికెట్, షటిల్ పోటీలు
-15 వ తేదీ విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తామని తెలిపిన కమిషనర్, ఎంఎల్ఏలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 12 నుండి 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా, తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి తెలియచేసేలా ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల సహకారంతో సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవితో కలిసి బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సంబరాల బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నూతన ఏడాది గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించనున్నామన్నారు. సంబరాల్లో ప్రతి అంశానికి తగిన సమయంతో షెడ్యుల్ తో బ్రోచర్ ఉందన్నారు. తంబోలా, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్ పోటీల్లో పాల్గొనే వారు మంగళవారం సాయంత్రం నుండి ఎన్టీఆర్ స్టేడియంలో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
ఎంఎల్ఏ  మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ఆంధ్రుల అతి పెద్ద పండుగని, దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు సంక్రాంతికి స్వంత ప్రాంతాలకు వస్తుంటారన్నారు. సంక్రాంతి వేడుకలను జిఎంసి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా, మరో 5 ఏళ్ల పాటు మర్చిపోలేని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామన్నారు. 7 మంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులతో కమిటి ఏర్పాటు చేసి, సంబరాలను పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సాంప్రదాయ పద్దతులను నేటి తరానికి తెలిపేలా వేడుకలు ఉంటాయని, సంబరాల్లో నిర్వహించే పోటీల్లో విజేతలకు 15వ తేదీ బహుమతులు అందిస్తామన్నారు. మీడియా మిత్రులకు కూడా క్రికెట్, షటిల్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.
సంబరాల వివరాలు :
12 వ తేదీ ఉదయం 9 నుండి 11 గంటల వరకు ముగ్గుల పోటీలు (ఆడవాళ్లకు మాత్రమే), మెహంది (ఆడవాళ్లకు, పిల్లలకు).
13 వ తేదీ ఉదయం 6 నుండి 11 గంటల వరకు విఐపిలకు పూర్ణకుంభ స్వాగతం, సన్నాయి మేళం, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, ఫుడ్ స్టాల్స్ ప్రారంభం, భోగి పళ్ళు, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, సాయంత్రం 5 నుండి 10 గంటల వరకు తంబోలా, సాంప్రదాయ వస్త్ర పోటీలు(మహిళలు, చిన్న పిల్లలు), చెక్క భజన, కూచిపూడి, ఫోక్ డ్యాన్స్, వాహనాలు డీ డ్యాన్స్ జరుగుతాయి.
14వ తేదీ ఉదయం 7 నుండి 10 గంటల వరకు గంగిరెద్దుల విన్యాసాలు, ఎద్దుల ప్రదర్శన, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, కర్రసాము, సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు కోలాటం, స్టార్ మ్యూజికల్ నైట్, కాంతార యాక్ట్, జగలర్స్, ఎక్స్ ట్రా స్కిట్..
15వ తేదీ సాయంత్రం 3:30 నందు 10:30 గంటల వరకు గాలి పటాలు ఎగుర వేయుట, ప్యూజన్ డ్యాన్స్, ప్రాసమణి గారి ప్రోగ్రాం, మ్యాజిక్ షో (ఇల్ యుజన్ షో), క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, వాసవి ఆర్కెస్ట్రా జరుగుతాయి.

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, కార్పొరేటర్లు ఈ.వరప్రసాద్, వి.శ్రీరామ్ ప్రసాద్, స్టేడియం మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ ముత్తినేని రాజేష్, లాల్ వజీర్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *