-రిటైనింగ్ వాల్ పక్కన 5 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేస్తాం
-17,18 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తూర్పునియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానదికి ఎంత పెద్ద స్థాయిలో వరదలు వచ్చినా కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారి ఇళ్లల్లోకి చుక్క వరద నీరు కూడా రానివ్వకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు.
మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17,18 డివిజన్లలో రాణి గారి తోట దగ్గర సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ దగ్గర మరియు తారకరామ నగర్ కరకట్ట వద్ద రూ.22.00 లక్షలతో కిచెన్ షెడ్డు, ఫ్లోరింగ్, మెట్లు, రైయిలింగ్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరై ఈ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ కృష్ణలంకలో నిర్మాణం చేసిన రిటైనింగ్ వాల్ పరిపూర్ణం కావాలంటే రిటైనింగ్ వాల్ పక్కనే 70 అడుగుల విస్తీర్ణంలో రోడ్డు, 5 పంపింగ్ స్టేషన్లను నిర్మాణం చేయాలన్నారు. ఈ ఈవిషయాన్ని 2014-19 సంవత్సరంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచెప్పారన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి పంపింగ్ స్టేషన్ల నిర్మాణం ప్రణాళికలను అమలు చేయలేదన్నారు. గత ఏడాది వరదలు వచ్చి కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు రావడంతో పంపింగ్ స్టేషన్లో నిర్మాణ అవసరాన్ని గుర్తు చేసినట్లు అయిందన్నారు.రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి అవ్వడంతో పంపింగ్ స్టేషన్ నిర్మాణం పనులను తమ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిందన్నారు. యనమలకుదురు కొండ దగ్గర నుంచి కృష్ణలంక మెట్లబజార్ వరకు మొత్తం ఐదు పంపింగ్ స్టేషన్లను నిర్మాణం చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెప్పారు. అందులో ముందుగా భూపేష్ గుప్తా నగర్, రామలింగేశ్వర నగర్ దగ్గర ముందుగా పంపింగ్ స్టేషన్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తారని, ఆ తర్వాత మిగిలిన మూడు ప్రాంతాల్లో పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేస్తారని అన్నారు. వరదలు వచ్చిన సమయంలో కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ పంపింగ్ స్టేషన్లోని విద్యుత్ మోటార్లు వరద నీటిని తోడేస్తాయని చెప్పారు. ఈ పంపింగ్ స్టేషన్ల దగ్గర జనరేటర్ కూడా ఏర్పాటు చేస్తారని, వరదలు వచ్చిన సమయంలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని పూర్తిస్థాయిలో పంపిణీ స్టేషన్లను నిర్మాణం చేస్తున్నామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా వీటి నిర్మాణ పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకుని వస్తామన్నారు. వైఎస్ఆర్సిపి అనుసరించిన విధానాల వల్లనే కృష్ణలంక ప్రాంతానికి వరదల సమయంలో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చాయని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. కృష్ణలంక ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలో చుక్క నీరు కూడా ఇంటిలోకి రాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు.
పార్టీ నాయకురాలు రాయి రంగమ్మ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర ఏ విధమైన అభివృద్ధి పనులు చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో ఈ కమ్యూనిటీ హాల్ గురించి పట్టించుకోకపోవడంతో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. ఈ హాల్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ను కోరారు.
పార్టీ నాయకులు వేముల దుర్గారావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందే కానీ అభివృద్ధి ఎక్కడా చేయలేదన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో నియోజకవర్గంలో చేసి చూపిస్తున్నారని అన్నారు. దగ్గర వృద్ధులు మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతున్నారని తాము గత నెలలో చెప్పామని నెల రోజులు కూడా దాటకుండానే కార్పొరేషన్ వారికి చెప్పి నిధులను మంజూరు చేయించి మెట్లు, రైయిలింగ్ నిర్మాణ పనులను ప్రారంభించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోనే కొట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. గత వైఎస్ఆర్సిపి పార్టీ హయాంలో ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా వారికి కమీషన్లు కక్కుర్తి పడి డివిజన్ లో పనులను చేశారని అన్నారు. రోడ్ల పైన మరో రోడ్డు నిర్మాణం చేయడం, పైపులు పైన పైపులు వేసి డివిజన్ లో డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులను చేసి డివిజన్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమములో పార్టీ నాయకులు పోలిపల్లి ముని, గోగుల రమేష్, మొకర ఆదిబాబు, పగడాల వెంకటేశ్వర రెడ్డి, కొప్పోలు శ్రీనివాస్, మొకర వెంకట రమణ, వేముల వెంకటేష్, రాయవరపు అశోక్, పల్లా సాగర్, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.