చిరు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..

-హెల్మెట్ లేని డ్రైవింగ్ క్షమించరాని నేరం
-డి .టి .సి ఎ. మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపటం క్షమించరాని నేరమని చిన్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణాన్ని బలిచేసుకోవద్దని ఉప రవాణా కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్బహించిన బైక్ ర్యాలీ ని డిటిసి ఎ మోహన్ మరియు రవాణా శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భం గా డిటిసి మోహన్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలలో అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించేందుకు రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహిస్తున్నామన్నారు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించని కారణంగా నిండు ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుందన్నారు. ద్విచక్ర వాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ వినియోగించాలని లేదంటే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. స్వచ్చంద సంస్థల సహకారంతో కార్లు ద్విచక్ర వాహనాలు నడిపే వాడికి సీటు బెల్టు హెల్మెట్ పై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సీటు బెట్టు హెల్మెట్ ధరించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాల కోల్పోకుండా చేయాలన్న ఉద్దేశమే లక్ష్యం పనిచేస్తున్నామన్నారు.

బైక్ హెల్మెట్ ర్యాలీ లో ఆర్టీఓ కె. వెంకటేశ్వరరావు, మోటార్ వాహన తనిఖీ అధికారులు కె. శివరాం గౌడ్, ఉదయ్ శివప్రసాద్, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం. రాజుబాబు కార్యాలయ సిబ్బంది, వాహన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *