Breaking News

లక్ష్యాలు అథిగమించేలా హౌసింగ్ అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని హౌసింగ్ లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలు ప్రతి వారం నిర్దేశించిన లక్ష్యాలు అథిగమించేలా హౌసింగ్ అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అభివృద్ధి , సంక్షేమ పథకాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలపై గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. రూఫ్ లెవల్ పూర్తి అయిన ఇళ్ల లబ్దిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంక్ లింకేజ్ ఋణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు ప్రతివారం నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. క్యాటిల్ షెడ్స్ మంజూరు అయిన వాటిలో 50 శాతం కూడా పూర్తి కాలేదని , ఈ వారంలో పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. యంయస్ యంఈ సర్వే నవంబర్ లో ప్రారంభం అయిందని , ఇంత వరకు పూర్తి కాలేదని వేగవంతం చేయాలన్నారు. ఆధార్ స్పెషల్ క్యాంపెన్ లో పిల్లలను నమోదు చేయించేలా చూడాలని , ఇందుకు యంపీడీఓ లు, సిడిపిఓ లు, అంగన్ వాడీ టీచర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పనులు మంజూరు అయి ఇంకా ప్రారంభించని వాటి స్థానంలో కొత్త పనుల ప్రారంభానికి 48 గంటల్లో అనుమతులు కోరినట్లైతే మంజరు చేయడం జరుగుతుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సక్షమ్ ద్వారా మంజూరు చేసిన త్రాగునీరు సరఫరా , మరుగుదొడ్ల నిర్మాణాలు డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాల్సి వున్నా ఇప్పటి వరకు పూర్తి కాలేదని , త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పోషణ్ వాటికల ఏర్పాటు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంజూరు చేసిన కిచెన్ గార్డెన్లు, టాయిలెట్లు రిపేర్లు, మంచినీటి సౌకర్యం , రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ తదితర పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖల ద్వారా వెంటనే ప్రారంభించేలా ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు, పంటకుంటలు ఏర్పాటు, ఉపాధి హామీ వర్కర్స్ రోజువారీ హాజరు పంపేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన గ్రామీణ 2.0 ఇళ్ళ నిర్మాణాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు అవాస్ ప్లస్ యాప్ ద్వారా నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సచివాలయ, హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించాలన్నారు. జిల్లాలో ఆర్టిఫిషియల్ లింబ్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ALIMCO) వారు ఫిబ్రవరి 4 నుండి 12 వరకు క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుందని , పిడబ్ల్యూడీలు, సీనియర్ సిటీజన్లకు చేతి కర్రలు , కృత్రిమ అవయమ పరికరాలు తయారు చేసి అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి 4 వ తేది ప్రత్తిపాడు, 5 వ తేది మంగళగిరి , 6 న పొన్నూరు , 7 న తెనాలి , 10 న తాడికొండ , 11 న గుంటూరు పశ్చిమ, 12 న గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్యాంప్ లు నిర్వహించే ప్రదేశాలలో యంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లు ఛైర్లు , టెంటు , టేబుల్స్ , పవర్ సప్లయ్, శానిటేషన్ , త్రాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. పరికరాల కొరకు వచ్చే దివ్యాంగులు వారి సదరన్ సర్టిఫికేట్ , ఇన్కమ్ ప్రూఫ్ , రేషన్ కార్డు , ఆధార్ కార్డు తీసుకురావలన్నారు. మరింత సమాచారం కొరకు 9389537925 ను సంప్రదించవచ్చన్నారు. అలాగే యన్ టీ ఆర్ హెల్త్ ఫించన్ , దివ్యాంగులు ఫించన్ పొందుతున్న వారు రీ వెరీఫికేషన్ చేయించుకోవలసి వుందన్నారు. వినికిడి , కంటి చూపు లోపం వున్న వారికి ఈ నెల 22 న తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని , ఫిబ్రవరి 4 న గుంటూరు జీజీహెచ్ లో యన్ టీ ఆర్ హెల్త్ ఫించన్ , దివ్యాంగులు ఫించన్ పొందుతున్న వారందిరకి క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రీ వెరీఫికేషన్ అయిన తరువాతనే ఫించన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ ప్రసాదు, సిపిఓ శేషశ్రీ , ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి , డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మీ, డ్వామా పీడీ శంకర్, భూగర్భ జలనవరుల శాఖ డీడీ వందనం, డీపీఓ సాయి కుమార్, జిఎస్ డబ్ల్యూ ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ మోహన్ రెడ్డి , సమగ్ర శిక్ష ఏపీడీ విజయలక్ష్మీ, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ ఏ డి సువార్త, ఏపీ ఎంఐపీ పీడీ వజ్రశ్రీ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *