నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీజే అబ్దుల్ కలాం కు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఘన నివాళులు అర్పించారు. నందిగామ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కలాం చిత్రపటానికి శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి ఏపీజే అబ్దుల్ కలాం చేసిన కృషి మరువలేనిదని ,శాస్త్రవేత్త గానే కాకుండా రాష్ట్రపతిగా దేశానికి అందించిన సేవలు ఎనలేనివన్నారు. అదేవిధంగా అబ్దుల్ కలాం భారతదేశపు అత్యున్నత పురస్కారాలైన భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, 40 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లతో పాటు ఎన్నో పురస్కారాలు పొందారని, నేటి యువత అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు , వార్డు ఇంచార్జ్ లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags nandigama
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …