Breaking News

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక దృష్టి ఉంటుంది

-తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యా రానివ్వరు
-జగ్గయ్య చెరువు కాలనీ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం
-పిఠాపురం పట్టణం, జగ్గయ్య చెరువు కాలనీ మహిళలతో ముఖాముఖీలో శాసన మండలి సభ్యులు నాగబాబు 

పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎప్పటికీ ప్రత్యేక దృష్టి ఉంటుందని శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణం స్పందించే నాయకుడు పవన్ కళ్యాణ్… అలాంటిది తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్య రానివ్వరు.. సమస్య ఉందీ అంటే పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టరని స్పష్టం చేశారు. శుక్రవారం  పిఠాపురం పట్టణ పరిధిలోని జగ్గయ్య చెరువు కాలనీలో మహిళలతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రెయినేజీ, తాగునీరు, రోడ్డు సౌకర్యాలు లేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నట్టు ఆ ప్రాంతవాసులు వివరించారు. గతంలో రోడ్లు వేయకుండా కూడా వేసినట్టు బిల్లులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నాగబాబు  మాట్లాడుతూ “సమస్యలు చెప్పడం ప్రజల హక్కు.. ప్రజా ప్రతినిధులుగా వాటిని పరిష్కరించడం మా బాధ్యత. పిఠాపురం నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన దృష్టికి వచ్చిన ఎవరెవరో సమస్యలు పరిష్కరిస్తారు. జగ్గయ్య చెరువు కాలనీవాసుల సమస్యలు కూడా ఆయన దృష్టికి వచ్చాయి. మీరు చెప్పిన సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపుతాం” అన్నారు.

పవన్ కళ్యాణ్  ప్రతినిధులుగా వచ్చాం.. ప్రజలు సంతోషించేలా సౌకర్యాలు కల్పిస్తాం:  పిడుగు హరిప్రసాద్ , శాసన మండలిలో ప్రభుత్వ విప్
శాసన మండలిలో ప్రభుత్వ విప్  పిడుగు హరిప్రసాద్  మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్  ప్రతినిధులుగా జగ్గయ్య చెరువు కాలనీవాసుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాం. మీ సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించమని  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. త్వరలో ఒక అధికార బృందాన్ని ఈ ప్రాంతానికి పంపి సమస్యలపై ఇంటింటి సర్వే నిర్వహిస్తాం. తక్షణం వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తాం. ప్రజలు సమస్యలు చెప్పుకుంటే భారంగా భావించే నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ . తన దృష్టికి వచ్చిన సమస్యలు ఎప్పుడు పరిష్కరిద్దామా అని ఆలోచన చేసే నాయకుడు. జగ్గయ్య చెరువు కాలనీవాసులంతా సంతోషపడే విధంగా ఈ ప్రాంతంలో సౌకర్యాలు కల్పిస్తాము. సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తాము” అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్  తుమ్మల బాబు, జనసేన పార్టీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, పిఠాపురం మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అతిథ్య రంగంలో పెట్టుబడులకు ఏపీ సరైన వేదిక

-ముంబయిలో జరుగుతున్న దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ లో జాతీయ,అంతార్జాతీయ హెటల్స్, ట్రావెల్స్ ప్రతినిధులతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *