విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు ముందుగా తమ ఫోన్ లో 73373 59375 ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. అనంతరం 73373 59375 కు వాట్సాప్ లో Hi అని మెసేజ్ పెట్టండి.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు స్వాగతం. ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ చేసుకోండి” అనే మెసేజ్ కనిపిస్తుంది. ఇందులో షెడ్యూల్ పై క్లిక్ చేయండి.
‘దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి’ అనే మెసేజ్ వస్తుంది. రైతు తన ఆధార్ నెంబర్ ను టైప్ చేయాలి. ఆ ఆధార్ నెంబర్ కలిగిన రైతు పేరు, ధాన్యం అమ్మే కొనుగోలు కేంద్రం పేరు స్క్రీన్ పై కనిపిస్తుంది.
ధాన్యం కొనుగోలు కేంద్రంపై క్లిక్ చేయగానే…ధాన్యం అమ్మే తేదీని ఎంచుకోండి అనే మెసేజ్ కనిపిస్తుంది. మీకు నచ్చిన తేదీపై క్లిక్ చేయండి.
అనంతరం ధాన్యం అమ్మే సమయాన్ని ఎంచుకోవాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూడు స్లాట్ లు ఉంటాయి.
ఇందులో ఉదాహరణకు ఉదయం 8 నుంచి 10 గంటల స్లాట్ ఎంచుకుంటే… ఇందులో 8, 9, 10 గంటల స్టాట్ ఏదో ఒక సమయాన్ని నిర్థారించుకోవాలి.
సమయాన్ని ఎంచుకున్న తర్వాత రైతు ఏ ధాన్యం అమ్ముతున్నారో తెలిపాలి. Common Sortex , Common Non Sortex ఇలా మీ ప్రాంతానికి సంబంధించిన రకాలు కనిపిస్తాయి.
రైతు ప్రభుత్వానికి అమ్మదలచిన ధాన్యంను బ్యాగ్స్ లో తెలపాలి. బ్యాగ్ సంఖ్య తెలపగానే రైతు పేరు, ఏ కేంద్రంలో, ఏ తేదీన ఏ స్లాట్ లో ఏ సమయానికి ఎన్ని బ్యాగ్ లో ధాన్యం కొనుగోలు వివరాలు డిస్ ప్లే అవుతాయి. అదేవిధంగా కూపన్ కోడ్ వస్తుంది.
ఏఐ వాయిస్ ఓవర్ తో రైతులను గైడ్ చేస్తూ వాట్సాప్ లో సులభంగా ధాన్యం కొనుగోలు షెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.
Tags amaravathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News