Breaking News

నవజాత శిశువులపై ప్రత్యేక దృష్టి సారించండి:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవజాత శిశువుల అనారోగ్య పరిస్థితులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది,బుధవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు,సభ్యులు గొండు సీతారాం,కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణ, జంగం రాజేంద్ర ప్రసాద్ లు సందర్శించారు,ఆసుపత్రిలో గత 3 ఏళ్ళు నుండి నేటి వరకు నమోదైన నవజాత శిశువులు వివరాలు,వారు పొందిన వైద్య విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు,నవ జాత శిశువుల తల్లిదండ్రులతో మాట్లాడారు,అనంతరం కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లోని నవ జాత శిశువుల విభాగాలను సందర్శించి వాటిల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సిఫారసులు చేయనున్నట్టు చెప్పారు,బాలల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న తమ కమిషన్ ఆసుపత్రుల్లో వివిధ చర్యలకు ప్రణాళికతో కమిషన్ అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఈ పర్యటనలో ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ.డాక్టర్ యు.శోభ,వైద్యులు సునీత,అశ్వినీ,ఖ్యాతి,సౌజన్య,శేషు బాబు,ఇంచార్జ్ నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *