మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు ఆర్ డివో ఎస్ఎస్కీ ఖాజావలి గురువారం నగరంలోని 3వ మరియు 6వ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది పనితీరు, సచివాలయాల పనితీరు ఆరా తీశారు. నిబంధనల మేరకు ప్రభుత్వ పధకాల సమాచారం, లబ్దిదారుల వివరాలు సరిగా డిస్ ప్లే చేశారా లేదా పరిశీలించారు. సచివాలయాల సేవలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయా, గ్రీవెన్సు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించారా లేదా రికార్డులు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హాజరు అమలు పరిశీలించారు. ప్రతిరోజు ఫీవర్ సర్వే చేస్తున్నారా, ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో నివేదికలు పంపుతున్నారా ఆర్ డివో పరిశీలించారు. 3వ దశ కరోనా రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ప్రతి వాలంటీరు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఫీవర్ సర్వే నిరంతరంగా నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు గల వారికి టెస్టింగ్ చేయించడం, మందులు అందజేయడం జరగాలన్నారు. బందరు మండల తహసిల్దారు డి. సునీల్ బాబు ఆర్డీవో వెంట ఉన్నారు.
Tags machilipatnam
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …