విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నిర్మాణాలు జరిగే గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, హెల్త్ క్లినిక్ లతో పాటు ఇతర ఉపాధి హామి నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఉపాధి హామి పథకం ద్వారా ప్రారంభమైన నిర్మాణాల ప్రగతిని ఆయన సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్స్ వీరాస్వామిలతో పాటు పంచాయతీరాజ్, ఇఇలు, డిఇలను ప్రత్యక్షంగా ఏఇలు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 15 ఇసుక రీచ్ లు ఉండగా అందులో రొయ్యూరు, వల్లూరుపాలెం, ఉస్తేపల్లి రీలను ఈ నిర్మాణాలకే ప్రత్యేకంగా కేటాయించమన్నారు. రొయ్యూరు ఇసుక రీచ్ లో పంచాయతీరాజ్ శాఖ తరుపున ఒక ఉద్యోగిని పర్యవేక్షణ కోసం నియమించలన్నారు. ఏఇలు తమ వాహనాలను పంపుతు వాహన నెంబరు ఆతనికి ఇవ్వాలన్నారు. ఆయన వచ్చిన లారీ, ట్రాక్టర్‌కు 620 రూపాయలు, యూనిట్ మొత్తం చెల్లించి తీసుకువెళాలన్నారు. ఒక వేళ ఇసుక ఇవ్వడానికి కాంట్రాక్టర్ నిరాకరిస్తే రీచ్ ను రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని కలెక్టర్ స్పష్టంచేశారు. అలాగే జిల్లాలో జరిగే ఉపాధి నిర్మాణాలకు సిమ్మెంట్ను ప్రత్యేకంగా కేటాయిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఇసుక, సిమ్మెంట్ ఇస్తున్నందున నిర్మాణాలు పూర్తి చేసేందుకు అభ్యంతరం ఏముందని ఇంజనీర్లను ప్రశ్నించారు. అలాగే వచ్చే వారంలోపు గ్రామ సచివాలయాలకు పై స్లాట్లు, రూఫ్ లెవల్, స్లాప్ పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తి చేయని పక్షంలో షోకాజ్ నోటీసులు అందుకోవడానికి సిద్ధంగా వుండాలని కలెక్టర్ హెచ్చరించారు. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీకు సిమ్మెంటు ఇస్తున్నాం కాదా, మరి పనుల్లో ప్రగతి చూపించలన్నారు. జిల్లాలో 809 గ్రామ సచివాలయాలు ఉండగా 383 సచివాలయాలు రూఫ్ లెవల్‌కు వచ్చాయని, అలాగే 150 భవనాలు మొదటి పైకప్పు, 99 ఫినిషింగ్ పూర్తి చేసుకున్నాయన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల భవనాలు 797 ఉండగా వాటిలో 579 భవనాలు రూఫ్ స్థాయికి, 105 భవనాల నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. అలాగే 658 హెల్త్ క్లినిక్ నిర్మాణాల్లో 522 భవనాల పైకప్పు పనులు పూర్తి కాగా మరో 50 నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …