Breaking News

వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో రూ. 75 లక్షల వ్యయంతో నూతన పైపు లైన్ పనులను ప్రారంభించిన … : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇళ్ళును సకల సౌకర్యాల లోగిళ్ళు గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కైకలూరు లోని ఏలూరు రోడ్డు లోగల వైఎస్సార్ జగనన్న గ్రీన్ వీలేజ్ లో లబ్ధిదారులు కోసం రూ. 75 లక్షల వ్యయంతో నూతన పైపు లైన్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కైకలూరు పట్టణంలో వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రూ.75 లక్షల పైపు లైన్ పనులను నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా వుందని, కైకలూరు పట్టణంలోని భవనమ్మ చెరువు దగ్గర నుంచి 4.7O కిలోమీటర్లు పైపు లైన్ పనులు త్వరగతిన పూర్తి చేస్తాంమన్నారు. వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లోఅన్ని రకాలుగా మౌళిక సదుపాయాలు కల్పించి అధునాతన వసతులతో సుందరమైన నివాసిత ప్రాంతంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఎల్. వెంకటేశ్వరరావు, సర్పంచ్ డీయం.నవరత్నకుమారి, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, ఎస్ఐ. షణ్ముఖసాయి, గాయత్రి, ఆర్ డబ్ల్యూఎస్. డీఈఈ శాస్త్రి, ఆర్ డబ్ల్యూఎస్. ఏఈఈ నాగబాబు,హోసింగ్ ఏఈఈ మూర్తి , ఈవో లక్ష్మినారాయణ, నిమ్మల సాయిబాబు, వార్డ్ మెంబెర్స్, సమయం అంజిబాబు, యండీ.గాలిబ్ బాబు, సమయం శ్రీనివాస్,బుద్ధా మహాలక్ష్మి,,కటికనా రఘు,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *