ఆటపాక లోగల జాన్ పేట జగనన్న లే అవుట్ లో రూ.40 లక్షల తో మంచినీటి పైపులైన్ పనుల ప్రారంభించిన… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో కైకలూరు సర్పంచ్ గా తాను ఆటపాక వాస్తవ్యులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేసిన సంకల్ప బలమే ఈరోజు భగవంతుని దయతో శాసనసభ్యునిగా ఆ పనిని చెయ్యడానికి దోహదం చేసిందని భావిస్తున్నానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావుఅన్నారు. మంగళవారం ఆటపాక పరిధిలో గల జాన్ పేటలోని నూతన జగనన్న లే అవుట్ లో రూ.40 లక్షల అంచనాతో మంచినీటి పైపులైన్ పనుల ప్రారంభోత్సవం కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సంపు నిర్మాణానికి భూమిపూజ చేసి..జే.సీ.బీ కి కొబ్బరికాయ కొట్టి పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ ఆటపాకలో ఇప్పుడు లే అవుట్ చేసిన స్థలం కైకలూరు గ్రామ పంచాయతీ కి చెందినదని, అయితే ఇక్కడి జాన్ పేట వాస్తవ్యుల్ని ఇరుకు కాపురాలనుండి విముక్తుల్ని చెయ్యాలంటే ఆటపాకలో స్థలం అందుబాటులో లేని కారణంగా ప్రత్యేకంగా కైకలూరు కు చెందిన భూమిని సేకరించి 232 మంది పేదింటి అక్క చెల్లెమ్మ లకు జగనన్న ఆశీస్సులతో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు చేయబడిన లే అవుట్ లో 280 మంది వరకు ఇచ్చే అవకాశం ఉందని, ఇంకా అర్హులు మిగిలిఉంటే వారికి కూడా కేటాయింపు చెయ్యడం జరుగుతుందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ చోట్ల ఉమ్మడి స్థలాలు వదలడం జరిగిందని, ఇప్పుడు కడుతున్న సంపు ప్రక్కన త్వరలో ఓహెచ్ ఆర్ ఎస్ నిర్మాణం చేసి మంచినీరు అందించడం తో పాటుగా కాలనీలోని ఇంటింటికి ఉచితంగా మంచినీటి కుళాయి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఇక్కడ ఒక పాఠశాల నిర్మాణం తో పాటుగా అంగన్వాడీ భవనం నిర్మించడం జరుగుతుందని, అలాగే ఇక్కడే డా.వై.ఎస్.ఆర్ వెల్ నెస్ సెంటర్ నిర్మిస్తామన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇక్కడే పరిష్కరించుకునే సౌకర్యం దీనితో లభ్యం అవుతుందన్నారు. లే అవుట్ చేసేడప్పుడు మిగిలిన క్రాస్ ముక్కలో నుండి అనువుగా ఉన్న 5 సెంట్లు స్థలం డా.బి.ఆర్.అంబేద్కర్ వారి పేరు మీద కమ్యూనిటీ అవసరార్ధం కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామంలో రెండు సచివాలయాలు కట్టవలసి ఉండగా ఒకటి నిర్మాణం పూర్తి కావస్తుందని, మరొకటి ఇంకా నిర్మాణం ప్రారంభం కాలేదని ఇది అభివృద్ధికి అవరోధం కావున గ్రామ సర్పంచ్, మెంబెర్స్, ఇతర నాయకులు బాధ్యత తో నిర్మాణం మొదలు పెట్టించి ముందుకు సాగాలన్నారు. గ్రామ సర్పంచ్ తలారి మణెమ్మ అధ్యక్షత న జరిగిన ఈ సభలో ఎంపిపి అభ్యర్థి ఆడివికృష్ణ, ఆర్ డబ్ల్యు ఎస్ డి.ఈ.ఈ శాస్త్రి, హౌసింగ్ డి.ఈ.ఈ ఆదినారాయణ, ఉప సర్పంచ్ బావిశెట్టి నాగేశ్వరరావు, పంచాయితీ కార్యదర్శి రామలక్ష్మి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కూనవరపు సతీష్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఏ.ఈ నాగబాబు, నాయకులు నిమ్మల సాయి, తలారి జాన్ విల్సన్, కన్నా రమేష్, కన్నా బాబు,మదన్, విజయ్,బందా నారాయణ, పెద్దిరాజు, గుణ, రాజీవ్ గాంధీ,యోహాను, వడ్లాని వెంకటేశ్వరరావు, జ్యోతి, సమర్పణ,రాము, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *