Breaking News

ఏపీఎల్ సీజ‌న్ -4 మారుమూల ప్రాంతాల క్రికెట్ క్రీడాకారులకు చక్కటి అవకాశం

-ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు , ఏసీఏ సెక్ర‌ట‌రీ సానా సతీష్ బాబు
-ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్ సీజ‌న్ -4 ప్రీ ప్లానింగ్ పై మీడియా సమావేశం
-ఆగస్టు 8 నుంచి ఏపీఎల్ సీజన్-4 మ్యాచ్ లు ప్రారంభం
-ఏపీఎల్ సీజ‌న్ -4 లో 25 మ్యాచులు వైజాగ్ స్టేడియంలోనే 25 మ్యాచులు
-ఈ నెల 14 వ తేదీన రాడిషన్ బ్లూ లో ఏపీఎల్ సీజ‌న్ -4 క్రికెట్ ప్లేయ‌ర్స్ అక్షన్
-ఐపీఎల్ మ్యాచులు ఆర్గ‌నైజ్ చేసిన టీమ్ తోనే ఏపీఎల్ -4 నిర్వ‌హ‌ణ‌
-ఏసీఏ ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లో వుమెన్ టీ- ట్వంటీ లీగ్ ఏర్పాటు

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో నిర్వ‌హించిన‌ ఏపీఎల్ మూడూ సీజన్ల కంటే ఏపీఎల్ సీజ‌న్ 4ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నాము. క్రికెట్ లో కొత్త‌ టాలెంట్ ను ప్రోత్సహించడానికి ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్ ఒక చక్కటి వేదిక గా నిలుస్తుంద‌ని ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు , ఏసీఏ సెక్ర‌ట‌రీ, రాజ్య‌స‌భ ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు.

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-4 కి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియ‌జేసేందుకు ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు , ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ , రాజ్య స‌భ ఎంపీ సానా సతీష్ బాబు శ‌నివారం న‌గ‌రంలోని ఏసీఏ వి.డి.సి.ఎ ఇంట‌ర్నెష‌న‌ల్ క్రికెట్ స్టేడియం లో మీడియా సమావేశం నిర్వ‌హించారు.

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్న ఏపీఎల్ సీజన్-4 మ్యాచ్ లు ఐపీఎల్ తరహాలో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వున్న క్రికెట్ ప్లేయ‌ర్స్ టాలెంట్ ను వెలికి తీయటానికి ఏపీఎల్ వంటి టోర్న‌మెంట్ లు దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు.

గ‌తంలో ఫ్రాంచైజీల ఫీజు 75 ల‌క్ష‌లు వుండ‌గా, ఆ ఫీజు రూ.2 కోట్ల‌కు పెరిగింద‌న్నారు. ఎపీఎల్-4 కి 7 ఫ్రాంచైజీ లు ముందుకొచ్చాయని, గతంలో 6 ఫ్రాంచైజీలు మాత్ర‌మే వున్నాయ‌న్నారు. ఏపీఎల్ -3 సీజ‌న్ లో 430 మంది ప్లేయ‌ర్స్ వేలంలో పాల్గొన‌గా, ఇప్పుడు 520 మందికి పూల్ పెంచ‌డం జ‌రిగింద‌న్నారు.
వేలం లో పాల్గొనే ప్లేయర్స్ ను 4 కేటగిరీలో విభజించిన‌ట్లు చెప్పారు. ఇందులో గ్రేడ్ ఏ లో 21 మంది, గ్రేడ్ బి లో 112 మంది, గ్రేడ్ సి 378 మంది వుంటార‌ని వివ‌రించారు. ఇండియా క్రికెట్ టీమ్ లో, ఐపీఎల్ లో ఆడిన ప్లేయ‌ర్స్ సుమారు 9 మంది టాప్ సీడ్ లో వుంటార‌న్నారు.

ఏపీఎల్ సీజ‌న్ -4 కి సంబంధించిన ప్లేయ‌ర్స్ అక్ష‌న్ ఈ నెల 14 వ తేదీన రాడిషన్ బ్లూ లో జ‌రుగుతుంద‌న్నారు. మెయిన్ ప్లేయర్స్ ను ఫ్రాంచైజ్ లు రిటేయిన్ చేసుకున్నాయన్నారు.. గత సీజన్ లో 15 మ్యాచ్ లు జ‌రగ్గా, ఈ సీజ‌న్ లో 21 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ మొత్తం 25 మ్యాచులు జరుగుతాయన్నారు.

ఈ ఐపీఎల్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ లాంటి యంగ్ ప్లేయర్స్ ఏ విధంగా ప్రతిభ కనబరిచారో అలాంటి ప్లేయర్స్ నీ వెలికితీసేందుకు ఎపీఎల్ చ‌క్క‌టి ప్లాట్ ఫామ్ గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. డొమిస్టిక్ క్రికెట్ మ్యాచులు ఆడ‌కుండా ఎంతో మంది క్రికెట్ ప్లేయ‌ర్స్ ఐపీఎల్ లో చ‌క్క‌టి ప్ర‌తిభ చూపించి ఇండియా క్రికెట్ టీమ్ లో స్థానం సంపాదించారు. అలాగే ఎపీఎల్ లో కూడా ప్ర‌తిభ చూపించిన క్రికెట్ ప్లేయ‌ర్స్ కు ఆంధ్రా క్రికెట్ టీమ్ ఆడే రంజీ మ్యాచ్ లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. ఈ ఏపీఎల్ మ్యాచులు ఒక ప్ర‌ముఖ ఛానెల్ లో లైవ్ ప్ర‌సారం చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

అనంత‌రం ఏసీఏ సెక్ర‌ట‌రీ, రాజ్య‌స‌భ ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఏపీఎల్ సీజ‌న్ -4 లో జ‌ర‌గ‌బోయే 25 మ్యాచులు వైజాగ్ స్టేడియంలోనే జ‌రుగుతాయన్నారు. వ‌చ్చే ఏడాది మంగ‌ళ‌గిరి, వైజాగ్ , క‌డ‌ప స్టేడియాల్లో ఏపీఎల్ మ్యాచులు ప్రాంతాల వారీగా నిర్వ‌హిస్తామన్నారు.

ఏపీఎల్ లో క్రికెట్ ప్లేయ‌ర్స్ కి ఆడే ఛాన్స్ ఎక్క‌వ‌గా రావ‌టం కోసం మ్యాచులు పెంచ‌టం జ‌రిగింద‌ని, అలాగే ఏపీఎల్ లో ఆడే క్రికెట్ ప్లేయ‌ర్స్ ను ప్రోత్స‌హించేందుకు కొత్త‌గా నాలుగైదు అవార్డులు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఐపీఎల్ నిర్వ‌హించిన టీమ్ తో ఏపీఎల్ -4 ఆర్గ‌నైజ్ చేయిస్తున్న‌ట్లు చెప్పారు. ప్రైజ్ మ‌నీ కూడా భారీగానే వుంటుంద‌న్నారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ త‌రుఫున రాబోయే ఐపీఎల్ సీజ‌న్ లో వైజాగ్ కి మ‌రిన్నీ మ్యాచులు తీసుకురావ‌టానికి కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. వైజాగ్ క్రికెట్ గ్రౌండ్ లో మార్చి నెల‌లో రెండు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన‌ క్రికెట్ ప్లేయ‌ర్స్ అంద‌రూ స్టేడియం బాగుంద‌ని చెప్ప‌టంతో ఎక్కువ‌ మ్యాచులు రావ‌టానికి అవ‌కాశం వుంద‌న్నారు.

ఈ స్టేడియంలో ఐసీసీ వుమెన్ వ‌ర‌ల్డ్ క‌ప్ కి సంబంధించి 5 క్రికెట్ మ్యాచులు, డిసెంబ‌ర్ లో ఇండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా వ‌న్డే మ్యాచ్, జ‌న‌వ‌రిలో ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ టీ -ట్వంటీ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మ‌హిళ క్రికెట్ ప్లేయ‌ర్స్ ను కూడా ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశ్యంతో ఏసీఏ త‌న సొంత నిధుల‌తో ఆంధ్రా క్రికెట్ వుమెన్ టీ-ట్వంటీ లీగ్ మ్యాచులు నిర్వ‌హించనున్న‌ట్లు తెలిపారు. ఈ షెడ్యూల్ త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌న్నారు

ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ క్రికెట్ ప్లేయ‌ర్స్ కు అన్ని ర‌కాల స‌దుపాయ‌లు క‌ల్పించి క్రికెట్ లో రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తుంద‌న్నారు. ఈ ఏడాది ఏసీఏ నుంచి ఐపీఎల్ కి ఏడెనిమిది మంది క్రికెట్ ప్లేయ‌ర్స్ వెళ్ల‌టం జ‌రిగింద‌ని, వ‌చ్చే ఏడాది ఐపీఎల్ కి 15 మందిని పంపించాల‌నే ల‌క్ష్యంతో ఏసీఏ కృషి చేస్తోంద‌న్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఏసీఏ ఉపాధ్య‌క్షుడు పి.వెంక‌ట రామ ప్ర‌శాంత్, ఏసీఏ కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస‌రావు , కౌన్సిల‌ర్ దంతు గౌరు విష్ణు తేజ్ ల‌తో త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“యూ ట్యూబ్” న్యూస్ చానెళ్ల జర్నలిస్టులకోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు సి.ఆర్. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *