విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఆహర్నిశలు శ్రమిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా స్పందన కార్యక్రమం అని మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమములో భాగంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాయలం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కారించేలా అధికారులు చర్యలు తీసుకోవటం జరుగుతుందని మేయర్ తెలిపారు. గత నెల జూలై 26వ తేదీన స్పందన పున ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుంచి ఆగస్టు 2, 9, 16, 23 వ తేదీ కలిపి ఇప్పటి వరకు ఐదు స్పందన కార్యక్రమము జరిగాయన్నారు. ఇందులో ప్రజలు నేరుగా 81 సమస్యల అర్జీలను అందించగా 59 అర్జీలను పరిష్కరించుటం జరిగిందన్నారు. ఆర్ధిక పరమైన 20 అర్జీలు, పునపరిశీలనలో 2 అర్జీలు కలిపి మొత్తం 22 ఆర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించటం జరిగిందన్నారు. ప్రతి సోమవారాలు అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమములో ప్రజలు నేరుగా అందించిన అర్జీలను సంబందిత వెబ్ సైట్ నందు నమోదు చేసి సంబందిత అధికారులకు పంపించుట జరుగుతుందన్నారు. అధికారులు లేదా క్షేత్ర స్థాయి సిబ్బంది క్షేత్ర స్థాయితో పాటు పరిశీలించి సమస్యలను పరిష్కరించుట జరుగుతుందన్నారు. సమస్యలను పరిష్కరించిన తదుపరి అర్జీ దారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోని స్పందన వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేయుటం జరుగుతుందని వివరించారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …