Breaking News

నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం… : జిల్లా కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లావ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని(డీ-వార్మింగ్ డే) ఈనెల 31 న మంగళవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్త్య మరియు పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా ఆగష్ట్ 31న డీ – వార్మింగ్ డే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాల విద్యార్ధులకు డీ-వార్మింగ్ మాత్రలు (ఆల్బెండజోల్ 400 మి.గ్రా) నమిలి తినిపించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతీ అంగన్వాడి కేంద్రంలో ఒకటి నుండి రెండేళ్ల లోపు పిల్లలకు అరమాత్ర, రెండు నుండి ఐదేళ్ల లోపు పిల్లలకు ఒక మాత్ర, ఆరు నుండి 19 ఏళ్ల లోపు గల పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మాత్రలు వేయించడం జరుగుతుందని వివరించారు. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్ధికి మధ్యాహ్నం భోజనం తరువాత ఒక మాత్రను ఇచ్చి నమిలి తినిపించడం జరుగుతుందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో ప్రతీ పాఠశాలలో నిర్ధేశించిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాల్లో 8, 52,911మంది విద్యార్ధులున్నారని చెప్పారు. వీరందరికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే మాత్రలను ఆయా పాఠశాలలు, కళాశాలలకు చేరవేయడం జరిగిందని, ప్రతీ పాఠశాలకు ఒక ఆరోగ్య సిబ్బందిని పర్యవేక్షకులుగా నియమించినట్లు తెలిపారు. గ్రామాల్లో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు. మండల పరిధిలో పి.హెచ్.సి.వైద్యాధికారి, ఎం.పి.డి.ఓ, ఎం.ఇ.ఓ, సి.డి.పి.ఓ, సి.ఆర్.పి ద్వారా పర్యవేక్షణ చేయబడుతుందని అన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన ఎటువంటి దుష్పరిణామాలు ఉండబోవని, ఎటువంటి లక్షణాలు కనిపించిన తక్షణమే దగ్గరలోని పి.హెచ్.సి వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. కోవిడ్ నేపధ్యంలో నులి పురుగు నివారణ మాత్రలు ఇచ్చే సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సామాజిక దూరం, మాస్క్, శానిటైజేషన్ చేసుకోవడం తప్పనిసరి అని సూచించారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా నులిపురుగులను నిర్మూలించవచ్చని, దీనిపై విద్యార్ధులకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. మాత్రలు తీసుకోలేని విద్యార్ధులకు ఆగష్ట్ 31 నుండి సెప్టెంబర్ 6 వరకు ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటివద్దనే మాత్రలు వేయించడం జరుగుతుందన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *