-పాట్ సైకిల్-2 లో 40 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసిన రాష్ట్ర పరిశ్రమలు
-పాట్ సైకిల్ 2 వివరాలు వెల్లడించిన కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్
-3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్ నకు సమానమైన (0.295 ఎంటీఓయి ) ఇంధనం ఆదా
-దీని విలువ సుమారు రూ 2,350 కోట్లు
-1.38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుదల
-పాట్ సైకిల్ 2 లో ఆంధ్ర ప్రదేశ్ అద్భుతమైన పని తీరు — అభయ్ బాక్రే , డైరెక్టర్ జనరల్ బీఈఈ
-దేశ వ్యాప్తంగా పాట్ సైకిల్ 2 కింద 14.08 ఎంటీఓఈ ఇంధనాన్ని ఆదా .. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్
-పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య వినియోగం, పొదుపు కోసమే పాట్ స్కీం అమలు
-ఎనర్జీ ఎఫిసీఎంసీ ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోగలుగుతున్న పరిశ్రమలు
-ఆర్థిక వ్యవస్థకు , పారిశ్రామిక ఉత్పత్తి , పర్యావరణ మెరుగుదలకు దోహదం
-ఎనర్జీ ఎఫిసిఎన్సీ తో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు కూడా ప్రయోజనం
-ఎనర్జీ ఎఫిసిఎన్సీ కి ఏపీ పెద్ద పీట .. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి
-రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎనర్జీ ఎఫిసిఎన్సీ అమలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధన సమర్ధ వినియోగం, పొదుపుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది . పారిశ్రామిక రంగంలో అమలు చేస్తున్న పాట్ పథకం (పెర్ఫర్మ్, అచీవ్ అండ్ ట్రేడ్) కింద 3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్ నకు సమానమైన (0.295 ఎంటీఓయి ) ఇంధనాన్ని ఆదా చేసింది. దీని విలువ సుమారు రూ 2,350 కోట్లుగా ఉంటుంది. అంతే గాక 1.38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించగలిగింది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ( బీఈఈ ) ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది.
పాట్ మొదటి దశతో పోలిస్తే మన రాష్ట్రం పాట్ సైకిల్-2 లో 40 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసినట్లు బీఈఈ స్పష్టం చేసింది. పారిశ్రామిక ఇంధన వినియోగంలో ఆధునిక విధానాలను అవలంబించటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఇంధనాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించగలుగుతున్నదని తద్వారా పెద్ద ఎత్తున ఇంధనాన్ని పొదుపు చేయగలుగుతుందని బీఈఈ ప్రశంసించింది.
పాట్ సైకిల్ 2 వివరాలను వెల్లడించేందుకు జాతీయ స్థాయి వెబినారును బీఈఈ నిర్వహించింది. ఇంధన పోదుపు లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు సంబంధించి ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లను కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ విడుదలు చేసారు. ఈ సందర్భంగా బీఈఈ అధికారులు మాట్లాడుతూ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో తక్కువ వ్యయంతో ఇంధనాన్ని సమర్ధంగా వినియోగించటం , పొదుపు చేయడం లక్ష్యం గా పాట్ స్కీం ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఎనర్జీ ఎఫిసిఎన్సీ సాంకేతికత వినియోగించటం ద్వారా ఇంధనాన్ని ఆదా చేసేందుకోసం ఎంపిక చేసిన పరిశ్రమలకు లక్ష్యాలను నిర్ణయిచటం జరుగుతుంది. ఈ లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు బీఈఈ ఇంధన పొదుపు సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. సదరు పరిశ్రమలు ఆ సర్టిఫికెట్లను పవర్ ఎక్స్చెంజీలలో విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జింజవచ్చు . అదే సమయంలో పాట్ పథకం లక్ష్యాలను చేరుకోలేని పరిశ్రమలు పవర్ ఎక్స్చెంజీల ద్వారా ఆ ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
దేశ వ్యాప్తంగా ఇంధనాన్ని ఎక్కువగా ఉపయోగించే భారీ పరిశ్రమలు పాట్ స్కీం అమలు ద్వారా కోట్లాది రూపాయలను ఆదా చేయగలుగుతున్నాయి. తద్వారా తక్కువ వ్యయంతో నాణ్యమైన ఉత్పత్తి సాధించ గలుగుతున్నాయి.
ఇదే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పాట్ పథకం మొదటి దశ తో పోలిస్తే 40 శాతం ఎక్కువ ఇంధనాన్ని పొదుపు చేయటం ద్వారా జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించింది. పాట్ మొదటి దశలో 0. 205 ఎంటీఓఈ (మిలియన్ టన్స్ అఫ్ ఆయిల్ ఈక్వివలెంట్) ఇంధన పొదుపు చేయగా పాట్ రెండవ దశ లో 0.295 ఎంటీఓఈ ఇంధనాన్ని ఆదా చేయగలిగిందని బీఈఈ తెలిపింది. ఇది 3,430 మిలియన్ యూనిట్ల విద్యుతునకు సమానం. దీని విలువ రూ 2350 కోట్లుగా లెక్కించవచ్చు. అలాగే 1.38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గడం వల్ల రాష్ట్రంలో పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది.
వెబినార్లో పాల్గొన్న కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ మాట్లాడుతూ పాట్ సైకిల్ 2 లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పరిశ్రమలను అభినందించారు. పరిశ్రమలన్నీ ఇదే విధమైన కృషిని కొనసాగిస్తే వాటితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామిక ఉత్పత్తి రంగానికి, అంతిమంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని కూడా పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే విద్యుత్ లో సింహభాగం పారిశ్రామిక రంగంలోనే వినియోగం జరుగుతుందని తెలిపారు.
అయితే ఇంధన సామర్ధ్య సాంకేతికతను అభివృద్ధి చేసి విస్తృతంగా వినియోగంలోకి తెస్తే భారీ పరిశ్రమలే కాకుండా చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించ గలుగుతామని, అధిక ఉత్పత్తిని తక్కువ వ్యయంతోనే సాదించగలుగుతామని పేర్కొన్నారు. ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయటం పరిశ్రమ రంగానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్ లో ఇంధన వనరులకు భారీగా పెరగున్న డిమాండును తట్టుకోవడానికి ఎనర్జీ ఎఫిసిఎన్సీ ఒక్కటే సులువైన, తక్షణ పరిష్కారమని ఆయన తెలిపారు.
బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే మాట్లాడుతూ దేశంలో ఇంధన భద్రతను సాదించడం , పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, ఉద్యోగ ఉపాధికల్పనను మెరుగుపరచడం లో ఎనర్జీ ఎఫిసిఎన్సీ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల వివిధ రాష్ట్రాలు ఆయా పరిశ్రమల్లో పాట్ పథకాన్నిఅమలు చేయటం పై చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. దీనికి సంబందించి అన్ని రాష్ట్రాలను తగిన సహకారం అందించేందుకు బీఈఈ ఎల్లపుడు సంసిద్ధంగా ఉండుంటుందని తెలిపారు. పాట్ సైకిల్ 2 కింద ఆంధ్ర ప్రదేశ్ అద్భుతపమైన పని తీరు ప్రదర్శించినందుకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లిని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ తో కలిసి ప్రత్యేక పాట్ సెల్ ను ఏర్పాటు చేసి ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఆయన చర్యలు తీసుకున్నారని బాక్రే తెలిపారు.
దేశ వ్యాప్తంగా వివిధ రకాల పరిశ్రమల్లో పాట్ సైకిల్ 1 లో 8. 8 ఎంటీఓఈ ఇంధనం ఆదా చేయగా , ప్రస్తుతం పాట్ సైకిల్ 2 కింద 14.08 ఎంటీఓఈ ఇంధనాన్ని ఆదా చేసినట్లు బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తెలిపారు. ఇది 31 మిలియన్ టన్నుల బొగ్గు ఆదా కు సమానం అన్నారు. అలాగే 66 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించగలిగామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా పరిశ్రమ రంగంలో 11 సెక్టార్లకు సంబందించి 542 పరిశ్రమలను పాట్ సైకిల్-2 లో ఎంపిక చేయకగా వాటిల్లో 349 పరిశ్రమలు ఇంధన పొదుపు లక్ష్యాలను సాదించగలిగాయన్నారు . వీటికి గాను 57. 38 లక్షల ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లను (ఈ సెర్ట్స్) అందచేసినట్లు చెప్పారు. అలాగే లక్ష్యాలు చేరుకోలేని 193 పరిశ్రమలు 36. 67 లక్షల సర్టిఫికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని బీ ఈ ఈ తెలిపింది.
ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ పాట్ సైకిల్ 2 లో రాష్ట్ర పరిశ్రమలు అద్భుతమైన పని తీరు కనబరిచాయని అభినందించారు . రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇంధన భద్రత , చౌక విద్యుత్ , నాణ్యమైన కరెంటు సరఫరా , ఆర్థికాభివృధి , పారిశ్రామిక ప్రగతికి ఇంధన సామర్థ్యం విశేషంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ రంగాల్లో ఇంధన సామర్ధ్యాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతుందని తెలిపారు.
రాష్ట్ర పరిశ్రమల రంగంలో ఇంధన సామర్ధ్యాన్ని సాదించేందుకు బీఈఈ అందిస్తున్న నిరంతర సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. బీఈఈ అందిస్తున్న తోడ్పాటుతో, రాష్ట్ర పరిశ్రమల శాఖ సహకారంతో పాట్ స్కీం ను మున్ముందు మరింత విస్తృతంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు . ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన పరిరక్షణ సంస్థ , రాష్ట్ర పరిశ్రమల శాఖ సమన్వయము తో పరిశ్రమల్లో అవగాహనా కల్పించాలని విజ్ఞప్తి చేసారు. అలాగే ఆర్థికాభివృధి పై ప్రభావం చూపగలిగే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇతర పర్యావరణ సవాళ్ళను ఎదుర్కునేందుకు గాను ఇంధన సామర్థ్యం , ఇంధనం పరిరక్షణ ప్రధాన ఆయుధంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
PAT సైకిల్ -2 ట్రేడింగ్ సెప్టెంబర్ -2021 చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇందులో 542 డిసిలు ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఇఎక్స్), పవర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పిఎక్స్ఐఎల్) అందించే ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌తో పాల్గొనే అవకాశం ఉంది. PAT సైకిల్- II డిసిల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 ఆగస్టు 23 నుండి ప్రారంభమైంది.ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్ల ట్రేడింగ్ ప్రక్రియపై డీసీలకు అవగాహన కల్పించడం కోసం పాట్ సైకిల్ -2 వినియోగదారులందరితో వరుస వెబ్‌నార్‌లు ప్రణాళిక పూర్తిచేసుకొని , డీసీలకు ట్రేడింగ్ లో సహకారం అందించేందుకు, బీఈఈ రంగాల వారీగా వెబినార్‌ను 25 ఆగస్టు 2021 నుండి ప్రారంభించిందని అశోక్ కుమార్ చెప్పారు