-అందుబాటులో 15000 వ్యాక్షిన్లు…
-డిజిటల్ అసిస్టెంట్ డేటా అప్లోడ్ చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న మోగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయాలని అధికారులకు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ.ఏ.ఎస్ సూచించారు. నగర పాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం 54వ డివిజన్ మహమద్ అల్లిపురం వార్డ్ సచివాలయo నందు జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, పలు సూచనలు చేశారు. నగరంలో 286 సచివాలయల్లో 15000 వ్యాక్షిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నగరంలో నిర్వహించే కోవిడ్ టీకాల కార్యక్రమం నూరుశాతం విజయవంతం కావాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారి జాబితాలను అనుసరించి వారందరికీ టీకాలు వేసేలా చూడాలన్నారు. అన్ని సచివాలయాలలో తప్పనిసరిగా (Digital assistant -EDPS) డిజిటల్ అసిస్టెంట్ డేటా అప్లోడ్ చేసేలా భాద్యత వహించాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచాలన్నారు. సచివాలయాల్లో అందిస్తున్న సేవల తీరు, నిర్వహిస్తున్న రిజిస్టర్లు, సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా ప్రదర్శించడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం చేయాలన్నారు. సచివాలయల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచలన్నారు. సేవలకు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమములో 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్, చీఫ్ మెడికల్ అధికారి డా.జి.గీతభాయి, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.