Breaking News

తెనాలిలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

– రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
– గుంటూరు జిల్లాలో 5.85 లక్షల మందికి, తెనాలిలో 83 వేల మందికి సెప్టెంబర్ 15లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ కార్డుల పంపిణీ పూర్తి- మంత్రి నాదెండ్ల

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
నిజాయితీ లేని గత ప్రభుత్వ దుష్ట ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నందివెలుగులో మంత్రి నాదెండ్ల మనోహర్, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోటి 46 లక్షల మందికి స్మార్ట్ కార్డ్ సేవలు అందిస్తున్నాము. తద్వారా రాష్ట్రంలోనే నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలు పుష్కలంగా అందుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామన్నారు. మహిళలకు దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన హామీ ప్రకారం అందరికీ సిలిండర్ల సబ్సిడీ అందజేస్తున్నాము అని వివరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నాం అన్నారు. అర్హులైన లబ్ధిదారులు గుర్తించే విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామన్నారు.

ప్రతి ఇంటికి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. గత మూడు నెలలుగా 65 సంవత్సరముల పైబడిన వృద్ధులు, వికలాంగులకు ప్రతినెల ఐదు రోజులు ముందుగా వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ కార్డుల పంపిణీ పూర్తి చేస్తాం అన్నారు. కార్డులోని QR కోడ్ స్కాన్ చేస్తే లబ్ధిదారుడు ఎప్పుడు సరుకులు తీసుకున్న సమాచారం వెంటనే ప్రభుత్వానికి చేరుతుంది. రాష్ట్రంలోని 29 వేల చౌక ధర దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్, గోధుమలు ప్రజలకు అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తున్నాం అన్నారు. ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా సంప్రదించవచ్చు. పోర్టబులిటీ సౌకర్యం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చు అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా స్మార్ట్ కార్డులను ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా అమలులోకి తీసుకొస్తున్నాం. అలాగే పెన్షన్లు రూ. 4వేలను అందించడం అనేది యావత్ దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది. తల్లికి వందనం ద్వారా ఒకే రోజున రూ. పదివేల కోట్లను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అన్నదాత సుఖీభవ ద్వారా దాదాపు రూ. 3,175 వేల కోట్లకు పైగా నగదు రైతులకు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. వీటికి తోడు అభివృద్ధి ఎక్కడా ఆగకుండా అమరావతి, పోలవరం గాని, రాష్ట్రంలో రోడ్లు మరమ్మతులు, నిర్మాణాలు గానీ చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

ఎన్నికలకు ముందు మేము తెనాలి నియోజకవర్గం నందివెలుగులోకి రావాలంటే ఎంత ఇబ్బంది పడ్డామో మాకు, మనోహర్ కి బాగా తెలుసు. కానీ ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి అందరూ గమనించాలి. ఇలా అన్ని వర్గాలను మెప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“యూ ట్యూబ్” న్యూస్ చానెళ్ల జర్నలిస్టులకోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు సి.ఆర్. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *