-ఎఫ్ పీవో ల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనలు…
విజయవాడ/తోట్లవల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తోట్లవల్లూరు మండలం,చాగంటిపాడు గ్రామంలో ని శ్రీ విఘ్నేశ్వర రైతుల ఉత్పత్తి సంస్థ (ఎఫ్ పిఓ) ను జిల్లా కలెక్టర్ జె. నివాస్ సందర్శించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎఫ్ పీవో లు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తిదారులకు మెరుగైన ఆదాయాన్ని అందించడమే రైతుల ఆధ్వర్యంలోని రైతుల ఉత్పత్తిదారుల సంస్థల ప్రధాన లక్ష్యమన్నారు. ఈ దిశగా పనిచేస్తు డాక్టర్ వైయస్ఆర్ లైఫ్ టైం ఏచివ్ మెంట్ అవార్డు కూడా పొందిన శ్రీ విఘ్నేశ్వర రైతుల ఉత్పత్తి సంస్థ ను ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. శ్రీ విఘ్నేశ్వర రైతుల ఉత్పత్తి సంస్థ ఛైర్మన్ చంద్ర మోహన్ రెడ్డి తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమలను కలెక్టర్ కు వివరించారు. తమ ప్రాంతంలో సుమారు 1500 ఎకరాల్లో అరటి పంట,300 టన్నుల వరకు కూరగాయలు సాగు చేస్తున్నామన్నారు. రైతులు పండించే అరటికాయల వేలం ఇక్కడ నిర్వహిస్తామని,ఇందుకు బయట వ్యక్తులు 10 శాతం కమిషన్ తీసుకుంటారని అదే తమ సంస్థ కేవలం 6 శాతం మాత్రమే తీసుకుంటుందని వల్ల రైతుకు 4 శాతం లబ్ది చేకూరుతుందన్నారు. తమ ఎఫ్ పీవో ద్వారా పురుగుల మందులు విక్రయయిస్తుమన్నారు.దీనివల్ల బయటకన్న 20 నుంచి 30 శాతం రైతులకు ఆదా అవుతుందన్నారు.ఎఫ్ పీవో లోని రైతు సభ్యులు పండించిన కూరగాయలను విక్రయించేందుకు చాంగంటి పాడు కట్టపై అవుట్ లెట్ ఏర్పాటు చేసి రోజు 5 నుంచి 6 వేల టన్నుల కూరగాయలు అమ్మకాలు సాగిస్తున్నమన్నారు. ఉద్యానశాఖ సహకారంతో కస్టమెరైజెషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, పసుపు పొలిషింగ్ డ్రమ్స్,ట్రాక్టర్ తదితర వాటిని రైతుల అవసరాలకు అందిస్తు రూ.200 నుంచి 300 వరకు ఖర్చు తగ్గిస్తున్నామన్నారు.దుక్కు దున్నే oదుకు బయట రూ.900 వసూలు చేస్తూoడగా, ఎఫ్ పీవో ద్వారా సభ్యులకు అయితే రూ.500,బయట వారికి రూ.600 తీసుకుంటు న్న మని ఆయన కలెక్టర్ జె. నివాస్ కు వివరించారు.షేర్ నెట్ కూడా ఏర్పాటు చేసి నారుకోసం విత్తనాలు ఇచ్చిన వారి నారు, స్వయంగా నారు కూడా ఉత్పత్తి చేస్తున్నామన్నారు.అరటి రైతులకు మరింత మెరుగైన ధర కల్పించేందుకు అరటి మగ్గించేందుకు 24 టన్నుల సామర్ధ్యం కలిగిన ఏర్పాట్లు చేశామన్నారు.వీరి వెంట ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.దయాకరబాబు తదితరులు పాల్గొన్నారు.