విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం సెంట్రల్ నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. అయోధ్య నగర్, మధురా నగర్ లలో జరిగిన ఆరో రోజు వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నారు. గణాధిపతి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్యం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎటువంటి విఘ్నాలు కలుగకుండా చూడాలని విఘ్నేశ్వరుని వేడుకున్నట్లు వెల్లడించారు. గణనాధుని దివ్య ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లవేళలా ఇదే విధంగా ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ ల ఇంఛార్జిలు, వైఎస్సార్ సీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …