Breaking News

దసరా శరన్నవరాత్రి ఉత్సవములు – 2021 సమయములో  భవానీ దీక్షా విరమణలపై సమావేశం… 

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు ది: 07.10.2021 నుండి ది: 15.10.2021 వరకు జరుగు దసరా శరన్నవరాత్రి ఉత్సవములు పురస్కరించుకుని కోవిడ్-19 ఉన్న నేపద్యములులో  కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన నిభందనలను అనుసరించి ది: 16.09.2021 న విజయవాడ, కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, తెలంగాణా, కర్ణాటక, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా ల నుండి మరియు ఇతర రాష్ట్రముల నుండి వచ్చిన గురు భవానీలు వారితో మల్లిఖార్జున మహా మండపం 6వ అంతస్తు నందు సమావేశము జరిగింది. ఈ  సమావేశము లో  గురు భవానీలు దేవస్థానమునకు శ్రీఅమ్మవారి దర్శనార్ధం విచ్చేయు భవానీభక్తులకు దేవస్థానము వారి తరపున చేయవలసిన ఏర్పాట్లు గురించి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ పైలా సోమినాయుడు మరియు కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ వారితో చర్చించారు. ఈ విషయమై భవానీలు అందరి తరపున ఈది ఎల్లారావు గురు భవానీ మరియు లంకా గురు గణేష్ భవానీ మాట్లాడుతూ గత సంవత్సరము ఇరుముడి భంధములు వారి స్వస్థలములోనే సమర్పించవలసినదిగా తెలియజేసియున్నారు. కాని శ్రీ అమ్మవారికి భక్తితో ఇరుముడి సమర్పిస్తారు కనుక అమ్మవారి వద్దనే సమర్పించుటకు తగిన ఏర్పాట్లు చేయవలసినదిగా కోరారు. తదుపరి ధర్మకర్తల మండలి చైర్మెన్  పైలా సోమినాయుడు వారు మాట్లాడుతూ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశము అనంతరం ఏర్పాట్లు విషయమై గురుభవానీల వారికి తెలియజేయగలమని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *